twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మన బలం ఏంటో చూపిద్దాం.. పవన్ కళ్యాణ్‌పై చిరు చిన్నల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!

    |

    గత కొన్ని నెలలుగా హోరెత్తుతున్న ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో సినీ తారలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తొలి సారి ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేన ఎలాంటి ప్రభావం చూపుతుందోనని ఎవరికి వారు లెక్కలు వేస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా జనసేన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    చిరంజీవి చిన్నల్లుడు

    చిరంజీవి చిన్నల్లుడు

    మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీనితో తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కళ్యాణ్ దేవ్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులకు సంతోషాన్నిస్తున్నాయి. ఇప్పటికే రాంచరణ్, బన్నీ, వరుణ్ తేజ్ లాంటి మెగా హీరోలు జనసేన పార్టీకి మద్దతు ప్రకటించారు.

    మన బలం ఏంటో చూపిద్దాం

    మన బలం ఏంటో చూపిద్దాం

    కళ్యాణ్ దేవ్ మాట్లాడుతూ.. ప్రజా శ్రేయస్సునే తన దారిగా ఎంచుకున్న జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మనమంతా మద్దతుగా నిలవాలి. మనమంతా అయన వెంట ఉండి మన బలం ఏంటో నిరూపించాలి. జనం కోసం ఆయన వేయాలనుకునే బంగారు బాటకు మనం చేయూతనిద్దాం అని కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పిలుపునిచ్చాడు.

    శుభాకాంక్షలు చెబుతూ

    శుభాకాంక్షలు చెబుతూ

    పవన్ కళ్యాణ్ తొలిసారి ఎన్నికల సమరాన్ని ఎదుర్కొనబోతున్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ దేవ్ పవన్ కి శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తానానికి నా శుభాకాంక్షలు అని కళ్యాణ్ దేవ్ కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

    పవన్‌కు పరామర్శ

    పవన్‌కు పరామర్శ

    ఇటీవల వడదెబ్బ కారణంగా అనారోగ్యానికి గురైన పవన్ ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ పరామర్శించిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ ఏకంగా రంగంలోకి దిగి తన తండ్రి నాగబాబు తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహించాడు. అల్లు అర్జు కూడా జనసేనకు నైతిక మద్దత్తు ప్రకటించాడు.

    English summary
    Chiranjeevi's Son In law Kalyaan Dhev interesting comments on Pawan Kalyan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X