చకచకా సినిమా పూర్తి చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి అల్లుడు!

By Bojja Kumar

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జతకలిసే మూవీ ఫేం రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ కథా చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. ఆల్రెడీ పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. కళ్యాణ్ దేవ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుడం మొదలు పెట్టారు.

మెగా స్టార్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, మెగాస్టార్ అల్లుడు అనే హోదాను వాడుకోకుండా ఇండస్ట్రీలో ఎదగాలని, తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉవ్విల్లూరుతున్న కళ్యాణ్ దేవ్ తన సినిమా ప్రమోషన్లకు మెగా ఇమేజ్‌ను వాడుకోవడం లేదు. పెద్దగా హడావుడి లేకుండానే సినిమాను చకచకా పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు.

Chiranjeevi’s son-in-law Kalyaan Dhev starts dubbing for his debut

ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బేనర్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి చిత్రానికి పని చేసిన సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సినిమా మొదలవ్వడానికి ముందే కళ్యాణ్ దేవ్ యాక్టింగ్, డాన్స్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌, మహేష్ బాబు, ప్రభాస్‌, వరుణ్‌ తేజ్‌ లకు శిక్షణ ఇచ్చిన 'స్టార్‌ మేకర్‌' సత్యానంద్‌ వద్ద ట్రైన్ అయ్యాడు. మెగా ఫ్యామిలీలో హీరోగా సెట్టయ్యే టాలెంట్ ఇతడిలో ఉందో? లేదో? త్వరలోనే తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X