వేధింపులు తాళలేక... పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన చిరంజీవి చిన్నల్లుడు!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో పెళ్లి జరిగిన తర్వాత నుంచి కళ్యాణ్ దేవ్ తరచూ వార్తల్లో ఉంటున్నారు. మోగా ఫ్యామిలీలోకి ఎంటరైన తర్వాత అతడు సినిమా రంగం వైపు అడుగులు వేయడం కూడా ఇందుకు ఓ కారణం. అయితే ఈ సారి కళ్యాణ్ దేవ్ పేరు వార్తల్లో వినిపించడానికి కారణం సినిమాలు కాదు.

వేధింపులు తాళలేక తాజాగా కళ్యాణ్ దేవ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో ఒక్కసారిగా మీడియా ఫోకస్ చిరు చిన్నల్లుడిపై పడింది. కొందరు వ్యక్తులు తనను టార్గెట్ చేస్తున్నారని, పచ్చి బూతులు తిడుతూ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారని కళ్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా

సోషల్ మీడియా ద్వారా తనకు ఈ వేధింపులు ఎదురవుతున్నట్లు కళ్యాణ్ దేవ్ పోలీసులకు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లోని ఫోటో కింద కామెంట్స్ బాక్సులో అసభ్యమైన పదజాలం ఉపయోగించి తిడుతున్నారని, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కళ్యాణ్ దేవ్ ఫిర్యాదు చేశారు.

అరెస్ట్ దిశగా పోలీసుల చర్యలు

అరెస్ట్ దిశగా పోలీసుల చర్యలు

కళ్యాణ్ దేవ్ మీద అసభ్యమైన కామెంట్లు చేస్తూ వేధింపులకు పాల్పడిన వారి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ సంస్థకు పోలీసులు నోటీలు పంపారు. కామెంట్లు చేసిన వారి వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేసే దిశగా చర్యలు మొదలు పెట్టారు.

యాంటీ మెగా అభిమానుల పనే...

యాంటీ మెగా అభిమానుల పనే...

కళ్యాణ్ దేవ్‌పై నీచమైన కామెంట్లు చేస్తున్నది యాంటీ మెగా ఫ్యాన్సే అయి ఉంటారని భావిస్తున్నారు. కొందరు తన పర్సనల్ లైఫ్ మీద నీచమైన కామెంట్లు చేస్తుండటంతో కళ్యాణ్ దేవ్ చాలా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. శ్రీజతో వివాహం తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న కళ్యాణ్ దేవ్‌ ఈ వ్యవహారంతో చాలా డిస్ట్రబ్ అయినట్లు తెలుస్తోంది.

కళ్యాణ్ దేవ్

కళ్యాణ్ దేవ్

మెగా ఫ్యామిలీ వారసత్వంతో ‘విజేత' అనే సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన కళ్యాణ్ దేవ్... సెలక్టివ్‌గా కథలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం కథలు వింటున్నారు. త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి ఫ్యామిలీలో బాగా కలిసి పోయిన దేవ్... ఇటీవల ఎన్నికల సమయంలో ‘జనసేన' పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X