»   » ఇపుడే కాదు: చిన్నల్లుడికి తేల్చి చెప్పిన చిరంజీవి!

ఇపుడే కాదు: చిన్నల్లుడికి తేల్చి చెప్పిన చిరంజీవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ సినిమాల్లోకి రావాలనే ప్లాన్లో ఉన్నాడని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం నిజమే అని మెగా ఫ్యామిలీ సన్నిహితులు కూడా అంగీకరిస్తున్నారు. తన కోరికను మామయ్య చిరంజీవికి ఇటీవలే వెల్లడించాడని, చిరంజీవి నుండి పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చిందని అంటున్నారు.

అయితే తెరంగ్రేటానికి ఇప్పుడే సరైన సమయం కాదని..... అంతకంటే ముందుగా నటన, డాన్సుల మీద ఫోకస్ పెట్టాలని సూచించాడట. దీంతో పాటు ప్రస్తుతం ఆషాడం కావడం కూడా ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడదామని చిరంజీవి స్పష్టం చేసారట.

మెగా ఫ్యామిలీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శ్రావణ మాసంలో ఇందుకు సంబంధించిన విషయాలపై చర్చిద్దామని.... సినిమాల్లోకి వచ్చే ముందుకు ఎలా సన్నద్దం కావాలి, ఎలాంటి కథతో తెరంగ్రేటం చేస్తే బావుంటుంది? లాంటి అంశాలపై మాట్లాడదామని చిన్నల్లుడికి చిరంజీవి సూచించారట.

మొత్తానికి మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది. శ్రీజ కూడా తన భర్తను హీరోగా చూడాలని ఆశ పడుతోంది, అంతే కాదు తాను కూడా సినిమా నిర్మాణ రంగంలో అడుగు పెట్టాలని ఆశపడుతోందట.

శ్రీజ

శ్రీజ

సొంతగా సినీ నిర్మాణ సంస్థను స్థాపించి... భర్తతో కలిసి ఇందుకు సంబంధించి వ్యవహారాలు చూసుకోవాలనేది శ్రీజ ప్లాన్.

చిన్న సినిమాలు

చిన్న సినిమాలు

తక్కువ బడ్జెట్ తో చిన్న సినిమాలు చేయాలనే ఆలోచనతో శ్రీజ-కళ్యాణ్ ఈ దిశగా ముందుకు సాగుతున్నారు.

సపోర్ట్

సపోర్ట్

మెగా ఫ్యామిలీ సపోర్టు, మెగా అభిమానుల అండ ఉంది కనుక తప్పక సక్సెస్ అవుతామనే నమ్మకంతో ఉన్నారు జంట.

చిరంజీవి

చిరంజీవి

శ్రావణ మాసంలో ఇందుకు సంబంధించిన విషయాలపై చర్చిద్దామని.... సినిమాల్లోకి వచ్చే ముందుకు ఎలా సన్నద్దం కావాలి, ఎలాంటి కథతో తెరంగ్రేటం చేస్తే బావుంటుంది? లాంటి అంశాలపై మాట్లాడదామని చిన్నల్లుడికి చిరంజీవి సూచించారట.

English summary
Film Nagar source said that, Megastar Chiranjeevi's son-in-law Kalyan to enter into films as a hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu