»   »  మెగా మ్యాజిక్: మేనల్లుడి సినిమాలో మామయ్య పాట

మెగా మ్యాజిక్: మేనల్లుడి సినిమాలో మామయ్య పాట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అందులో మరెన్నో హిట్ పాటలు కూడా ఉన్నాయి. ఇపుడు ఆ పాటలు ఆయన వారసుల చిత్రాల్లో రీమిక్స్ చేయడం ద్వారా మంచి ఫలితాలు రాబడుతున్నారు. తాజాగా చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రంలో కూడా చిరంజీవి చిత్రంలోని ఓ హిట్ సాంగును రీమిక్స్ చేస్తున్నారు. అయితే ఏ సాంగు రీమిక్స్ చేస్తున్నారనేది త్వరలో తెలియనుంది.

ఇప్పటికే చిరంజీవి సినిమాల నుండి రామ్ చరణ్ సహా, ఇతర మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో రీమిక్స్ చేసారు. బంగారు కొడి పెట్ట, శుభలేఖ రాసుకున్నా... పాటలు రామ్ చరణ్ నటించిన మగధీర, నాయక్ చిత్రాల్లో రీమిక్స్ చేయగా మంచి స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఇలాంటి సాంగ్ సాయి ధరమ్ తేజ్ సినిమాలో కూడా పెడితే బావుంటుందని భావిస్తున్నారు.

‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' చిత్రంలో ఏ సాంగ్ రీమిక్స్ చేసారనేది ఆగస్టు 23న జరిగే ఈచిత్రం ఆడియో వేడుకలో తెలియనుంది. చిరంజీవి చేతుల మీదుగా ఆడియో రిలీజ్ వేడుక జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈచిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన రెజీనా, అదా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

గెస్..

గెస్..


సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో చిరంజీవికి సంబంధించిన ఏ సాంగ్ రీమిక్స్ చేస్తారు? అనేది ఆసక్తి కరంగా మారింది.

హిట్ పెయిర్

హిట్ పెయిర్


పిల్లా నువ్వులేని జీవితంలో కలిసి నటించిన సాయి ధరమ్ తేజ్, రెజీనా హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు.

టీజర్

టీజర్


దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై ముందు నుండి పాజిటివ్ ఓపీనియన్ ఉంది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్


సినిమా సెప్టెంబర్ 24న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆడియో

ఆడియో


ఈచిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఆగస్టు 23న చిరంజీవి చేతుల మీదుగా ఆడియో విడుదల కానుంది.

English summary
A chartbuster song from Megastar Chiranjeevi's career has been remixed and used in Harish Shankar-Sai Dharam Tej's Subramanyam for Sale. "The song originally featured in one of the biggest hits of Chiranjeevi. It has been remixed and will be used at an important juncture in the film. The makers plan to reveal the details of the track soon," a source from the film's unit revealed.
Please Wait while comments are loading...