చిరంజీవి ఒడిలో విష్ణు నాలుగో సంతానం.. మంచువారబ్బాయి కామెంట్
మెగాస్టార్ చిరంజీవి ఆప్యాయంగా మంచు విష్ణు నాలుగో సంతానం ఐరా విద్యను ఎత్తుకున్నారు. దీపావళి రోజు మంచు విష్ణు ఇచ్చిన విందుకు స్పెషల్ గెస్ట్‌గా విచ్చేశారు చిరంజీవి. ఈ సందర్బంగా మంచు ఫ్యామిలీతో సరదాగా గడిపారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మంచు విష్ణు నివాసంలో చిరంజీవి
దీపావళి పండుగను పురస్కరించుకొని చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మంచు విష్ణు ఘనంగా విందు ఏర్పాటుచేశారు. శంషాబాద్‌లోని మంచు విష్ణు నివాసంలో ఈ వేడుక జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి, ప్రభాస్ సహా తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.

మెగాస్టార్ ఒడిలో మంచు మనవరాలు
మెగాస్టార్ చిరంజీవికి సాదర స్వాగతం పలికిన మంచు విష్ణు- విరానికా దంపతులు ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా తమ నాలుగో సంతానం, చిన్నకూతురు ఐరా విద్యను మెగాస్టార్‌కి పరిచయం చేసి, ఆయన ఆశీర్వాదం కోరారు. ఈ మేరకు మంచు వారి మనవరాలిని ఆప్యాయంగా ఒడి లోకి తీసుకొని ముద్దాడారు చిరు.

కూలెస్ట్ పర్సన్ మెగాస్టార్ అంటూ విష్ణు
ఈ సందర్బంగా మంచు విష్ణు దంపతులతో కాసేపు సరదాగా మాట్లాడి వారి చిన్న కూతురు ఐరా విద్యను ఆశిర్వదించారు చిరు. ఇందుకు సంబంధించిన ఫొటోలను
మంచు విష్ణు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. ‘‘కూలెస్ట్ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి అంకుల్‌కి ఐరా విద్యను పరిచయం చేశాను'' అని పేర్కొన్నారు. దీంతో ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి తెగ చెక్కర్లు కొడుతున్నాయి.
విష్ణు- విరానికా.. నలుగురు పిల్లలు
2009 మార్చిలో విరానికాను పెళ్లాడిన మంచు విష్ణుకి ఐరా విద్య నాలుగో సంతానం.మొదట కవల ఆడపిల్లలకు జన్మనిచ్చిన ఈ జంట.. వారికి అరియానా, వివియానా అని పేరు పెట్టారు. ఆ తర్వాత వారికి మగబిడ్డ జన్మించాడు. ఆ చిన్నారికి అవ్‌రామ్ భక్త అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే జనిమించిన నాలుగో బిడ్డకు ఐరా విద్య అని పేరు పెట్టుకునున్నారు ఈ మంచు దంపతులు.

కొరటాలతో మెగాస్టార్
ఇక మెగాస్టార్ విషయానికొస్తే.. ఇటీవలే సైరా నరసింహా రెడ్డి సినిమాతో సక్సెస్ సాధించిన ఆయన మరికొద్ది రోజుల్లో కొరటాల శివతో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications











