బన్నీని సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్.. అందరికి ఆశ్చర్యం!

Recommended Video

Chiranjeevi’s Surprise Visit To Naa Peru Surya Set

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నాపేరు సూర్య. ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటూ మే 4 న విడుదలకు సిద్ధం అవుతోంది. అల్లు అర్జున్ ఈ చిత్రంలో మిలటరీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు.ఆర్మీ మాన్ న్గా బన్నీ లుక్ అభిమానులను పిచ్చెక్కించే విధంగా ఉంది. రచయిత వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. దేశభక్తి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి బన్నీని ఆదివారం ఆశ్చర్యానికి గురిచేశాడు.

తిరుగులేని విజయాలతో

తిరుగులేని విజయాలతో

అల్లు అర్జున్ కెరీర్ పరంగా ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సరైనోడు, డీజే వంటి హిట్స్ బన్నీకి ఇటీవల దక్కాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం వక్కంతం వంశి దర్శకత్వంలో నా పేరు సూర్య చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 బన్నీ తొలిసారిగా

బన్నీ తొలిసారిగా

అల్లు అర్జున్ తన కెరీర్ లో తొలిసారి ఆర్మీ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం దేశభక్తి కథాంశంతో రూపొందబోతోంది. ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో విడుదలైన టీజర్, ఇటీవల విడుదలైన డైలాగ్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

నా పేరు సూర్య చిత్రం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బన్నీ ఈ చిత్రంలో మిలటరీ అధికారిగా సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. మే 4 న నా పేరు సూర్య చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది.

అను ఇమ్మాన్యుయేల్‌తో రొమాన్స్

అను ఇమ్మాన్యుయేల్‌తో రొమాన్స్

ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ ఆశలు పెట్టుకున్న అజ్ఞాతవాసి చిత్రం పరాజయం చెందడంతో అను బన్నీ చిత్రాన్ని నమ్ముకుని ఉంది.

బన్నీని సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్

బన్నీని సర్‌ప్రైజ్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ఆదివారం రోజున అల్లు అర్జున్ ని సర్ ప్రైజ్ చేశాడు. నా పేరు సూర్య సెట్స్ కి వెళ్లి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మెగాస్టార్ రాకతో చిత్ర యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేసింది. మెగాస్టార్ విజిట్ కు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆశ్చర్యంలో అంతా

ఆశ్చర్యంలో అంతా

ఊహించని విధంగా మెగాస్టార్ రావడంతో చిత్రయూనిట్ సంతోషంలో మునిగిపోయింది. దాదాపు అర్థ గంట పాటు చిరంజీవి నా పేరు సూర్య చిత్ర సెట్ లో గడిపారట. బన్నీ, దర్శకుడు వంశీ, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X