'సైరా నరసింహా రెడ్డి' వాయిదా.. స్పందించిన మెగా టీమ్.. ఫైనల్‌గా ఏం చెప్పారంటే!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానుందని అనౌన్స్ చేశారు. అయితే గత రెండు మూడు రోజులుగా 'సైరా' అక్టోబర్ 2 కు రిలీజ్ కావడం లేదని, కొన్ని రోజుల పాటు వాయిదా వేయడం జరిగిందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇలాంటి వార్తలపై 'సైరా' పీఆర్ టీమ్ రియాక్ట్ అయింది. ఆ వివరాలేంటో చూద్దామా..

వేగవంతమైన ప్రమోషన్స్.. ముంబైలో మీట్
'సైరా నరసింహా రెడ్డి' సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే ‘సైరా' మేకింగ్ వీడియో, టీజర్ రిలీజ్ చేయగా.. వాటికి విశేష స్పందన లభించింది. ఆ తర్వాత ముంబైలో ప్రెస్‌మీట్ కూడా నిర్వహించారు. బడా స్టార్స్ అంతా హాజరై సైరాను ప్రమోట్ చేశారు. అక్టోబర్ 2 న వెండితెరపై 'సైరా' ఎంజాయ్ చేయండని చెప్పారు.

మెగా అభిమానులను కలవరపెట్టే వార్త
ఈ లోగానే మెగా అభిమానులను కలవరపెట్టే విధంగా సోషల్ మీడియాలో ఓ వార్త పుట్టుకొచ్చింది. అదే సైరా నరసింహా రెడ్డి సినిమా వాయిదా పడటం. అనుకున్నట్లుగా సైరా సినిమా అక్టోబర్ 2న రావడం లేదని, ఈ సినిమాను అక్టోబర్ 8కి వాయిదా వేశారని వార్తలు పుట్టించారు కొందరు. దీంతో మెగా అభిమానుల్లో నిరాశ నెలకొంది.

అతను చెప్పడంతో రామ్ చరణ్ ఫిక్స్
అదే అక్టోబర్ 2న హృతిక్ రోషన్- టైగర్ ష్రాప్ కాంబినేషన్‌లో వస్తున్న 'వార్' సినిమా కూడా రిలీజ్ కానుంది. దీంతో సైరా హిందీ వర్షన్‌కు థియేటర్లు దొరకడం కష్టమని ఫర్హాన్ అక్తర్.. రామ్ చరణ్‌కు చెప్పాడని, సినిమాను వారం పాటు వాయిదా వేద్దామని కూడా కోరాడని వార్తలు వచ్చాయి. ఈ మేరకు సైరా వాయిదా వేయాలని రామ్ చరణ్ డిసైడ్ అయినట్లు, దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రానునట్లుగా పేర్కొన్నారు.

మెగా టీమ్ రియాక్షన్.. సమరానికి సిద్దమే
అయితే తాజాగా ఇలాంటి వార్తలపై సైరా పీఆర్ టీమ్ రియాక్ట్ అవుతూ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. సైరా నరసింహా రెడ్డి సినిమా వాయిదా పడిందనే వార్తలో ఏ మాత్రం నిజం లేదని వారు తేల్చి చెప్పారు. ఏ మాత్రం తగ్గేదే లేదని, 'వార్'తో సమరానికి సిద్దమే అని అన్నారు. ముందుగా అనుకున్న ప్రకారంగానే అక్టోబర్ 2 న ఈ సినిమా విడుదలవుతుందని వారు అంటున్నారు.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్‌తో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా రూపొందించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా తమన్నా ముఖ్యపాత్ర పోషించింది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











