twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. 'సైరా' నుంచి మరో సర్‌ప్రైజ్‌కి రంగం సిద్ధం

    |

    మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సైరా నరసింహా రెడ్డి'. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్ విడుదల కానుందనే ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. అయితే ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ కానుంది? వివరాల్లోకి పోతే..

     జోరుగా ప్రమోషన్స్.. సినిమాపై హైప్

    జోరుగా ప్రమోషన్స్.. సినిమాపై హైప్

    ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసిన 'సైరా నరసింహా రెడ్డి' యూనిట్.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది. ఈ మేరకు సినిమా నుంచి పలు పోస్టర్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఇటీవలే విడుదలైన ఈ సైరా టీజర్ యు ట్యూబ్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ రికార్డులు తిరగరాసింది.

    తొలి సాంగ్ విడుదలకు ముహూర్తం

    తొలి సాంగ్ విడుదలకు ముహూర్తం

    చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా 'సైరా నరసింహా రెడ్డి' నుంచి మొదటి సాంగ్ విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారని తెలుస్తోంది. వచ్చే వారమే ఈ లిరికల్ సాంగ్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారని ఫిలిం నగర్ టాక్. సినిమాపై అంచనాలు రెట్టింపు చేసేలా ఈ సాంగ్ కట్ చేశారని తెలిసింది.

    5 భాషల్లో భారీ రిలీజ్

    5 భాషల్లో భారీ రిలీజ్

    సైరా నరసింహా రెడ్డి సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుండటంతో దేశ వ్యాప్తంగా అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే భారీ రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది.

    సైరా నరసింహా రెడ్డి సినిమా గురించి

    సైరా నరసింహా రెడ్డి సినిమా గురించి

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తొలితరం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా నరసింహా రెడ్డి సినిమా రూపొందింది. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటించగా.. తమన్నా ముఖ్యపాత్ర పోషించింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

    English summary
    Periodical drama Sy Raa Narasimhaa Reddy is ready for release on october 2nd. Megastar Chiranjeevi taking special care on Sy Raa Narasimhaa Reddy movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X