twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి2, సాహోను కొట్టలేకపోయిన సైరా.. కానీ క్రేజీ రికార్డులు ఖాతాలోకి..

    |

    ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా చరిత్రను మలుపుతిప్పడానికి సైరా చిత్రం సిద్ధమవుతున్నది. మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో 151వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలకు సిద్దమవుతున్నది. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ నిర్మాతగా సుమారు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో రిలీజ్ కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతున్నదంటే..

    సైరా లెక్కలు వేయడం సాధ్యమేనా.. ఈజీగా ఐదు వందల కోట్లు.. వైరల్ అవుతున్న న్యూస్

     చిరంజీవి కెరీర్‌లోనే

    చిరంజీవి కెరీర్‌లోనే

    చిరంజీవి కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా నర్సింహారెడ్డి. ఈ చిత్రం కొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడానికి సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 4630 థియేటర్లలో విడుదల కానున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 1210 స్క్రీన్లలో ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నది.

     తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల వారీగా చూసుకొంటే నైజాంలో ఈ చిత్రం 430 థియేటర్లలో రిలీజ్ కానున్నది. తెలుగు సినిమా చరిత్రలో నైజాంలో ఇంత పెద్ద ఎత్తున రిలీజ్ కావడం ఇదే మొదటిసారి. ఇక సీడెడ్‌లో 330 థియేటర్స్, ఆంధ్రాలో 450 థియేటర్స్‌లో విడుదల కానున్నది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 1210 థియేటర్స్‌లో విడుదల కానున్నది.

    దేశవ్యాప్తంగా

    దేశవ్యాప్తంగా

    దేశవ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో అంటేఇక కర్ణాటకలో 340 థియేటర్స్‌లో, తమిళంలో 350 థియేటర్స్‌లో విడుదల కావడం అదో రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇక కేరళలో 130 థియేటర్స్‌లో రిలీజ్ కావడం, అలాగే ఇతర రాష్ట్రాల్లో అన్ని భాషల్లో కలిపి 1600 థియేటర్లలో విడుదల అవుతున్నది. ఇక ఓవర్సీస్‌లో 1000కి పైగా స్కీన్లలో ప్రదర్శించడానికి సిద్ధమవుతున్నది.

     ప్రపంచవ్యాప్తంగా

    ప్రపంచవ్యాప్తంగా

    తాజా సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ కౌంట్5 వేల వరకు ఉంటుందని పేర్కొంటున్నారు. ఇక ఇప్పటి‌వరకు టాలీవుడ్‌లో విడుదలైన భారీగా విడుదలైన చిత్రాల్లో బాహుబులి2 ముందు వరుసలో ఉంటుంది. బాహుబలి2 చిత్రం 8.5 వేల నుంచి 9 వేల మధ్య ఉంది. ఇక సాహో సుమారు 8 వేల వరకు ఉంది. సైరా నర్సింహారెడ్డి సుమారు 5వేల వరకు ఉంటుంది. బాహుబలి1 మాత్రం 4 వేల థియేటర్లలో రిలీజైంది.

    English summary
    Chiranjeevi's Sye Raa Movie Produced By Ram Charan And directed By Surender Reddy. This Movie Releasing On 2nd October. Movie got 187cr plus pre release business and releasing nearly 4630 theaters worldwide
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X