సైరా నరసింహారెడ్డి షూటింగ్ డేట్: మొదలు అక్కడే
సైరా నరసింహారెడ్డి సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి . విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 6ను షూటింగ్ డేట్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం.
Recommended Video

రాయలసీమ ప్రాంతంలో ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే సై రా నరసింహారెడ్డి అనే పదాలనే చిరు 151వ సినిమా టైటిల్ గా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంతకాలమైనా సైరా నరసింహారెడ్డి సినిమాకు సంబంధించి ఇంతవరకు ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేశారు. రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభించకపోవడంతో ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

అభిమానులలో భారీ అంచనాలు
మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉండగా, ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ వస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు డిసెంబర్ 6ను షూటింగ్ డేట్ గా చిత్ర బృందం ఫిక్స్ చేసినట్టు సమాచారం.

డిసెంబర్ లో షూటింగ్
ఈ నెలాఖరు వరకు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నింటిని పూర్తి చేసి ఎలాగైన డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభించాలని యూనిట్ ప్లాన్ గా తెలుస్తుంది. ఇప్పటికే చిరు తన మేకవర్ ని పూర్తిగా మార్చుకున్నట్టు సమాచారం. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో రామ్ చరణ్ చిరు 151వ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

బ్రిటీష్ పాలకులకు వ్యతిరేఖంగా
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. డబుల్ ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

డిసెంబర్ 6 నుంచి
డిసెంబర్ 6 నుంచి ఈ పిక్చర్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంటోంది. సైరా నరసింహరెడ్డి సినిమాకు బాగా క్రేజ్ తెచ్చింది ఈ సినిమా కోసం నటించనున్న తారాగణం. ఈ భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేయబోతున్నాడు.

నయనతార హీరోయిన్ రోల్
శాండల్ వుడ్ హీరో సుదీప్.. కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కూడా ఇందులో నటించనున్నారు. నయనతార హీరోయిన్ రోల్ చేస్తోంది. మ్యూజిక్ మాంత్రికుడు ఎ.ఆర్.రెహమాన్ చాలా కాలం తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీకి సంగీతం అందించబోతున్నాడు.

భారీ బడ్జెట్‌తో
ఈ సినిమాను భారీ బడ్జెట్ తో విజువల్ గ్రాండ్ గా తీయాలని అనుకుంటున్నారు మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దీనికి సంబంధించి ఏర్పాట్లలో ఉన్నాడని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.


Click it and Unblock the Notifications











