»   » అమరేంద్ర బాహుబలి రాజసం, సైరా నరసింహారెడ్డి గాంభీర్యం.. సేమ్ టూ సేమ్!

అమరేంద్ర బాహుబలి రాజసం, సైరా నరసింహారెడ్డి గాంభీర్యం.. సేమ్ టూ సేమ్!

Subscribe to Filmibeat Telugu

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 వ చిత్రం సైరా నరసింహా రెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన సమయం నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ తరహా పాత్రలో నటిస్తుండడం ఇదే తొలిసారి కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన ఏ అంశం అయినా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి సైరా లుక్ సోషల్ మీడియాని కుదిపేస్తోంది. ఈ లుక్ అప్పుడే అభిమానులు బాహుబలి లుక్ తో పోల్చేస్తున్నారు.

Saira Movie Stills Goes Viral In Internet
సైరా లుక్‌లో మెగాస్టార్ అదుర్స్

సైరా లుక్‌లో మెగాస్టార్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి సైరా లుక్ లో గాంభీర్యంగా కనిపిస్తున్నారు. ట్రెడిషనల్ వేషధారణలో చిరంజీవి లుక్ అభిమానులకు కన్నులపండగలా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నాడని ఈ లుక్ ద్వారా అర్థం అవుతోంది.

అమరేంద్ర బాహుబలితో పోలిక

అమరేంద్ర బాహుబలితో పోలిక

ప్రభాస్ అమరేంద్ర బాహుబలిగా రాజసం ఉట్టిపడేలా నటించాడు. ప్రభాస్ ఆహార్యం ఆ పాత్రకి సరిగ్గా అతికినట్లు ఉంది. బాహుబలి చిత్రంలో ప్రభాస్ ధరించిన సాంప్రదాయ వస్త్రాలు, వేషధారణ అభిమానులని తెగ ఆకర్షించాయి. సైరా లుక్ లో ఉన్న చిరంజీవిని ప్రభాస్ తో సోషల్ మీడియాలో జరుగుతోంది.

సేమ్ టూ సేమ్

సేమ్ టూ సేమ్

ప్రభాస్ అమరేంద్ర బాహుబలి పాత్రకోసం ధరించిన కాస్ట్యూమ్స్, సైరా లుక్ లో ఉన్న చిరంజీవి ధరించిన కాస్ట్యూమ్స్ ఒకేలా ఉన్నాయంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి లుక్ కు, అమరేంద్ర బాహుబలి లుక్ తో దగ్గర పోలికలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

 భారీ బడ్జెట్‌తో

భారీ బడ్జెట్‌తో

సైరా చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. బ్రిటిష్ వారితో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జరిపిన పోరాడాలని దర్శకుడు సురేందర్ రెడ్డి వెండితెరపై ఆవిష్కరించబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి బ్రిటిష్ వారికి ఎదురు నిలుస్తూ చెప్పే డైలాగుల కోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

భారీ తారాగణం

భారీ తారాగణం

ఈ చిత్రంలో నటించే నటులంతా ఆషామాషీ నటులు కాదు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ మరియు జగపతి బాబు వంటి ప్రముఖ నటులంతా కీలక పాత్ర పోషిస్తున్నారు.

English summary
Chiranjeevi’s Sye Raa Narasimha Reddy look inspired by Amarendra Baahubali. Sye Raa look goes viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X