మెగా పవర్ చూపిస్తూ రామ్ చరణ్ స్కెచ్.. విడుదలకు ముందే 'సైరా' సంచలనం
మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా నరసింహా రెడ్డి' విడుదలకు రంగం సిద్ధమైంది. రేపే (అక్టోబర్ 2) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను భారీఎత్తున విడుదల చేయబోతున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఏక కాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది సైరా నరసింహా రెడ్డి మూవీ. ఈ మేరకు సినిమాకు సంబంధించిన థియేటర్స్ కౌంట్ అప్‌డేట్ మరింత ఆసక్తి రేపుతోంది. ఆ వివరాలు చూస్తే..

ప్యాన్ ఇండియా మూవీ కావడంతో..
సైరా నరసింహా రెడ్డి సినిమాను ప్యాన్ ఇండియా మూవీగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయనుండటం కారణంగా ఆతృతగా ఉన్నారు ప్రేక్షకులు. తెలుగు సహా పలు భాషల్లోని బడా స్టార్స్ ఈ సినిమాలో భాగం కావడంతో దేశ వ్యాప్తంగా సైరా పై క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీంతో సినిమా విడుదలకు భారీ స్కెచ్ వేశాడు రామ్ చరణ్.

ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ సంఖ్య
దేశ విదేశాల్లో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ మేరకు మునుపెన్నడూ ఏ సినిమాకు లేని విధంగా వేల సంఖ్యలో థియేటర్స్ కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 'సైరా నరసింహా రెడ్డి' సినిమా థియేటర్ల సంఖ్య 4620 కంటే ఎక్కువే కావడం విశేషం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు చూస్తే..
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియావైస్ థియేటర్ల సంఖ్య చూస్తే.. నైజాం 420, సీడెడ్ 330, ఆంధ్ర 450 మొత్తంగా చూస్తే 1200 థియేటర్లలో సైరా నరసింహా రెడ్డి సినిమా భారీ ఎత్తున విడుదల కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు సైరా కోసం కళ్ళలో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఏరియావైస్ థియేటర్లు
దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో థియేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా కలిపి 1200, కర్ణాటక 340, తమిళనాడు 350, కేరళ 130, హిందీ, ఓవర్సీస్ కలుపుకుంటే 1600 థియేటర్లలో 'సైరా' నినాదం మారుమోగనుంది. సైరాకు దేశ వ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.

టీజర్, ట్రైలర్ సెన్సేషన్.. సెన్సార్
సైరా నరసింహా రెడ్డి సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇవి సోషల్ మీడియాలో వ్యూస్ పరంగా సరికొత్త రికార్డులకు తెరలేపుతూ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టాయి. ఇక సైరా చూసిన సెన్సార్ సభ్యులు సింగిల్ కట్ కూడా లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ అందించారు.

ఇదీ సైరా రేంజ్ అంటే..
విడుదలకు ముందే సైరా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా కూడా ఓ రేంజ్ బిజినెస్ చేసి రికార్డు నెలకొల్పింది సైరా. పైగా ఇప్పటికి వరుకు లేని విధంగా 5 భాషల్లో విడుదల కాబోతున్న తెలుగు సినిమా 'సైరా'నే కావడం విశేషం. దీంతో సైరా రేంజ్ ఏంటో ఇప్పుడే తెలుస్తోంది.. ఇక సినిమా విడుదల తరువాత సంచలనాలు ఊహించగలమా! అంటున్నారు విశ్లేషకులు.

సైరా నరసింహా రెడ్డి మూవీ
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











