చిరంజీవి పెట్టే టీవీ ఛానల్ పేరు.. ఓపినింగ్ డేట్ పూర్తి వివరాలు
ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సొంత టెలివిజన్ ఛానల్ ను పెట్టనున్నారనే వార్తలు చాలా కాలంగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ చానల్ ను తీసుకురావాలని ఆయన సంకల్పించారు. కాగా ఆ ఛానల్ పేరు పవర్ న్యూప్ అని పెట్టారని తెలస్తోంది. ఇక ఆ చానెల్ ఇరవైనాలుగు గంటల న్యూస్ ఛానల్ కానుంది. ఇకనుంచి చిరంజీవి ఆ ఛానెల్ పనిలోనే ఉంటారని,అందుకనే సినిమా కూడా ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు.
చిరంజీవి పుట్టిన రోజు అయిన ఆగస్టు ఇరవై రెండు నాటికి ఈ టీవీ ఛానల్ జనంలోకి తేవాలన్నది వారి ఉద్దేశంగా ఉంది. ప్రజారాజ్యం పార్టీని పెట్టినప్పటికీ, మీడియా తన చేతిలో లేకపోవడం వల్ల బాగా నష్టం జరిగిందని చిరంజీవి భావించే ఈ ఛానెల్ లాంచింగ్ చేస్తున్నారని వార్త. సన్నిహితులు భావిస్తుంటారు. సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మరికొందరు సన్నిహితులతో కలిసి చిరంజీవి ఈ చానల్ ను తీసుకువస్తున్నారు.టివీ నైన్ స్వప్న ఈ ఛానెల్ ని లీడ్ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.


Click it and Unblock the Notifications











