ఎమ్మెల్యేలు బలిసి కొట్టుకొంటున్నారు.. మీ ఊపిరి ఆగిపోతుంది.. ఖబర్దార్.. వైరల్‌గా చిరంజీవి వార్నింగ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ప్రముఖ నిర్మాతలు ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5వ తేదీన రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా ఊపందుకొన్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఉద్వేగంగా మాట్లాడుతూ..

మహేష్ బాబు తల్లికి శ్రద్దాంజలి

మహేష్ బాబు తల్లికి శ్రద్దాంజలి

చిరంజీవి తన ప్రసంగానికి ముందు మహేష్ బాబు తల్లి ఇందిరా దేవికి శ్రద్దాంజలి ఘటించి సంతాపం తెలిపారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. బుధవారం ఉదయం తెలుగు సినిమా పరిశ్రమలో విషాదం చోటుచేసుకొన్నది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు మాతృమూర్తి ఇందిరా దేవి కాలధర్మం చేసింది. ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఆయన అభిమానులకు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసుకొంటున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు.

 ఆలస్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు

ఆలస్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు

వైజాగ్‌లో షూటింగ్ చేసిన చిరంజీవి అనంతపురంకు బయలు దేరారు. అయితే ప్రత్యేక విమానం సాంకేతిక లోపం కారణంగా ఆలస్యంగా బయలు దేరింది. ఈ విషయం గురించి చిరంజీవి చెబుతూ.. ఫ్లయిట్ రెండు మూడు గంటలు ఆలస్యమైంది. దాంతో ఇక్కడికి నేను వస్తానా లేదా అనే సందేహం కలిగింది. కానీ నాపై మీ ప్రేమ బలమైంది కాబట్టే మీ వద్దకు వచ్చాను. మీ మనసుకు చేరువయ్యాను. అందుకే నేను మీకు శిరసు వచ్చి నమస్కరిస్తున్నాను అని చిరంజీవి అన్నారు

ఫెయిల్యూర్, సక్సెస్ కామన్

ఫెయిల్యూర్, సక్సెస్ కామన్

ఇటీవల తన కెరీర్‌లో దారుణమైన ఫలితాన్ని అందించిన ఆచార్య సినిమా గురించి పరోక్షంగా మాట్లాడుతూ.. ఈ మధ్య నేను ప్రేక్షకులను మెప్పించలేకపోయా. ఫెయిల్యూర్, సక్సెస్ కామన్. కానీ నా అభిమానులను ఆలరించలేకపోయానే అనే ఫీలింగ్, బాధ వెంటాడింది. మళ్లీ నా అభిమానులు మెప్పించడానికి గాడ్ ఫాదర్ చిత్రాన్ని అన్ని హంగులతో రూపొందించాం అని చిరంజీవి చెప్పారు.

వర్షం పడుతున్నా కదలకుండా

వర్షం పడుతున్నా కదలకుండా

గాడ్ ఫాదర్ సినిమా అన్ని వర్గాలను మెప్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గాడ్ ఫాదర్ సినిమా నిశ్శబ్ద విస్పోటనం. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమ ఉండాలి. మీరు వర్షం పడుతున్నా.. కదలకుండా ఉన్నారు. ఇదే కాదా నేను కోరుకొన్నది. ఇదే కదా మీ అభిమానాన్ని కోరుకొన్నది. మేము అనుకొన్న దానికంటే... పది రెట్లు జనం వచ్చారు. భారీ జనం వచ్చినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకొకుండా పోలీసులు శ్రమించారు. వారికి నా ధన్యవాదాలు అని చిరంజీవి అన్నారు.

ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూ..

ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తూ..

చిరంజీవి తన ప్రసంగాన్ని ముగించే ముందు గాడ్ ఫాదర్ చిత్రంలోని ఓ డైలాగ్ వినిపించమని యాంకర్ రవి కోరగా అందుకు సరేనని అన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను, రాజకీయ నేతలను దృష్టిలో పెట్టుకొని.. వారిని ఉద్దేశించి ఒక సినిమాలో చెప్పే డైలాగ్ ఇది. ప్రతీ ఒక్కరు రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, మద్యం కాంట్రాక్టులు అంటూ ప్రజల వద్ద సొమ్ము లాగేసుకొంటున్నారు.

ఒక్కో నాయకుడు బలిసి కొట్టుకొంటున్నారు. ఈ రోజు మీ ఊపిరి, మీ గాలి కాంట్రాక్టును నేను తీసుకొంటున్నాను. సుపరిపాలన అందివ్వాలని నిర్ణయం తీసుకోవాలి. తప్పు చేయాలనే భయం తప్ప మీ మనసులో ఏదీ ఉండకూడదు. ఏదైనా జరగకూడనది జరిగిందో.. మీ ఊపిరి ఆగిపోతుంది. ఖబర్దార్ అని తనదైన శైలిలో చిరంజీవి డైలాగ్ చెప్పారు.

అభిమానులకు దండాలు పెడుతూ..

అభిమానులకు దండాలు పెడుతూ..

గాడ్ ఫాదర్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగించే ముందు.. అభిమానులకు వినమ్రంగా దండ పెట్టుకొన్నారు. ఈ వర్షంలో, ఈ ట్రాఫిక్‌లో జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి. అమ్మ, నాన్నలు కంగారుపడుతుంటారు. ప్రతీ ఒక్కరు సురక్షితంగా ఇంటికి వెళ్లండి. ఈ వేడుకకు వచ్చిన అపశృతి జరగకుండా ఉండాలని కోరుకొంటున్నాను. ఈ అనంతపురంలో అనంత ప్రేమను ఇచ్చిన మిమ్మల్ని జీవితాంతం గుర్తు పెట్టుకొంటానని చిరంజీవి అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X