శభాష్ రాజశేఖర్.. మానవత్వంతో మనిషి ప్రాణాలు కాపాడావు.. కానిస్టేబుల్‌‌కు చిరంజీవి సెల్యూట్

మానవత్వం కరువవుతున్న ప్రస్తుత సమాజంలో సాటి మనిషి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్‌పై అన్నివర్గాల ప్రజలు, అధికారులు, ప్రభుత్వ నేతలు, సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాటి మనిషి ఆపదలో ఉన్న రాజేంద్ర చూపించిన ప్రేమ, అనురాగాలు, చొరవపై సెల్యూట్ చేస్తున్నారు. ఈ ఘటన వివరాలు, కానిస్టేబుల్ రాజశేఖర్‌పై ప్రముఖులు ప్రశంసల వివరాల్లోకి వెళితే..

మానవత్వం చాటిన కానిస్టేబుల్

మానవత్వం చాటిన కానిస్టేబుల్

హైదరాబాద్ రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో కానిస్టేబుల్ రాజశేఖర్ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ వాహనదారుడు గుండెపోటుకు గురయ్యారు. ఆయన విషమ పరిస్థితిని గమనించిన రాజశేఖర్ వెంటనే గుండెపై బలంగా తన చేతులతో ఒత్తిడి చేసి.. శ్వాస అందేలా సీపీఆర్ పద్దతి ద్వారా ప్రయాణికుడి ప్రాణాలు కాపాడారు. ప్రయాణికుడు తేరుకొన్న తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించడంతో పెను ప్రమాదం నుంచి వాహనదారుడు బయటపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.

హరీష్ రావు ప్రశంసలు

హరీష్ రావు ప్రశంసలు


కానిస్టేబుల్ రాజశేఖర్ మానవత్వాన్ని గమనించిన మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. రాజశేఖర్ చూపిన చొరవ, మానవత్వం వెలకట్టలేనిదని ప్రశంసించారు. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగిగి సీపీఆర్ పద్దతిపై అవగాహన కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణను రూపొందిస్తుందని అని హరీష్ రావు అన్నారు.

తెలంగాణ డీజీపీ ధన్యవాదాలు

తెలంగాణ డీజీపీ ధన్యవాదాలు


తెలంగాణ డీజీపీ పోలీస్ కార్యాలయం చేసిన ట్వీట్‌పై చిరంజీవి స్పందించారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి... వాహనదారుడికి సీపీఆర్ పద్దతిలో ప్రాథమిక చికిత్సను అందించారు ఆయన మానవత్వానికి, ధైర్య సాహసాలను ప్రశంసించలేకుండా ఉండలేకపోతున్నాం అని అన్నారు.

చిరంజీవి సెల్యూట్ అంటూ


డీజీపీ పోస్టును చిరంజీవి రీ ట్వీట్ చేస్తూ.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్‌కు నా సెల్యూట్. సకాలంలో స్పందించి.. సీపీఆర్ పద్దతిలో మనిషి ప్రాణాలు కాపాడటం నిజంగా గొప్ప విషయం. విధి నిర్వాహణకు మించి రాజశేఖర్ తన బాధ్యతను గుర్తు చేసుకొన్నారు. సాటి మనిషి కోసం చూపిన మానవత్వం కదిలిచింది. ఫ్రెండ్లీ పోలీస్ అనే విషయానికి సాక్ష్యంగా నిలిచింది అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X