ఇన్నేళ్ళ కెరీర్లో మెగాస్టార్ మొదటిసారిగా: సైరా నరసింహారెడ్డి కోసం చిరంజీవి టెస్ట్ షూట్

"సైరా నరసింహారెడ్డి" చిత్రం ఇన్నాళ్ల తన కెరియర్లోనే అత్యుత్తమమని చిరంజీవి భావిస్తున్నారు. ఈ చిత్రం విషయంలో ఎలాంటి పొరపాటు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారు.

Recommended Video

చిరంజీవికే టెస్ట్ షూటా..?

"సైరా నరసింహారెడ్డి" చిత్రం ఇన్నాళ్ల తన కెరియర్లోనే అత్యుత్తమమని చిరంజీవి భావిస్తున్నారు. ఈ చిత్రం విషయంలో ఎలాంటి పొరపాటు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారు. కథ ఏనాడో సిద్ధమైనా కానీ ప్రీ ప్రొడక్షన్‌ పనులకే నెలలు కేటాయించారు. సెట్స్‌ ఆల్రెడీ నిర్మించేసి ఇప్పట్నుంచే స్టూడియోలకి అద్దెలు కడుతున్నారు. ఒక్కసారి సెట్స్‌ మీదకి వెళితే ఇక వెనుదిరిగి చూడకూడదన్నంత పకడ్బందీగా అన్నీ సమకూర్చుకుంటున్నారు.

 మెగాస్టార్ ట్రయల్ షూట్

మెగాస్టార్ ట్రయల్ షూట్

ఈ నేపథ్యంలో చిరంజీవికి ఆ గెటప్‌ వేసి ఇటీవలే రెండు రోజుల పాటు ట్రయల్‌ షూట్‌ చేసారు. నమ్మలేక పోతున్నారు కదా కానీ ఇది నిజం మెగాస్టార్ ఈ సినిమాకోసం ట్రయల్ షూట్ లో పాల్గొన్నాడు. రీసెంట్ గా అందిన సమాచారం ప్రకారం చిరంజీవి తన జీవితంలో మొదటి సారి టెస్ట్ షూట్ లో పాల్గొన్నాడు.

అంచనాలు మాములుగా లేవు

అంచనాలు మాములుగా లేవు

కెరీర్ మొదట్లో కూడా మెగాస్టార్ ఈ స్థాయిలో టెస్ట్ షూట్ చేయలేదు. కానీ సైరా సినిమాపై అంచనాలు మాములుగా లేవులే. అంతే కాకుండా ప్రముఖ దిగ్గజ నటులు అండ్ టెక్నీషియన్స్ సినిమాలో భాగం కాబోతున్నారు. ఈ సమాచారం కూడా సినిమా మీద అంచనాలను బాగానే పెంచుతోంది.

 చిరు తన క్లారిటీ కోసం

చిరు తన క్లారిటీ కోసం

అందులోని చారిత్రాత్మక చిత్రం కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ సినిమాను చేయగలడా? అని అందరిలోను ఒక అనుమానం దాగి ఉంది. అయితే చిరు తన క్లారిటీ కోసం రెండు రోజుల వరకు డైరెక్టర్ చేత కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను టెస్ట్ షూట్ చేయించాడట. ఇలా పాత్ర కోసం టెస్ట్ షూట్ చేయడం చిరంజీవికి కూడా ఇదే మొదటిసారి.

 ఫుల్ కాస్ట్యూమ్‌తో

ఫుల్ కాస్ట్యూమ్‌తో

ఇక తాను కూడా పూర్తిగా ఫుల్ కాస్ట్యూమ్ తో షూట్ లో పాల్గొని ఒకసారి తన లుక్ ని అంతా చెక్ చేసుకున్నాడట చిరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గెటప్‌లో చిరంజీవి చాలా బాగా సెట్‌ అయ్యారని, చిరంజీవి కూడా తన లుక్‌ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసారని సమాచారం.

2019 వేసవిలో విడుదల

2019 వేసవిలో విడుదల

అలాగే నరసింహారెడ్డి పాత్ర కోసం తన వాచకంలోను చిరంజీవి మార్పు చూపిస్తున్నారట. ఈ చిత్రం డిసెంబర్‌ 6న షూటింగ్‌ మొదలు పెట్టుకుని 2019 వేసవిలో విడుదలవుతుందని చెబుతున్నారు. ఇంతటి బృహత్తర చిత్రాన్ని తన చేతిలో పెట్టడంతో దర్శకుడు సురేందర్‌ ఎలాగైనా దీనిని జాతీయ స్థాయిలో నిలబెట్టే సినిమాగా తీర్చిదిద్దాలని కసిగా పని చేస్తున్నాడని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

 దైర్యంగా షూటింగ్ ని స్టార్ట్ చేయొచ్చు

దైర్యంగా షూటింగ్ ని స్టార్ట్ చేయొచ్చు

మొత్తంగా మెగాస్టార్ సురేందర్ రెడ్డి వర్క్ - కాన్ఫిడెన్స్ ని చూసి సంతృప్తి చెందారట. ఇక దైర్యంగా షూటింగ్ ని స్టార్ట్ చేయొచ్చు అని నిర్ణయంచుకున్నారని కూడా తెలుస్తోంది. సైరా సినిమా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అంజనా ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X