గబ్బర్ సింగ్‌పై చిరంజీవి ఏమన్నారంటే...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం సూపర్ డూపర్ హిట్టయి అభిమానులను సంతృప్తి పరుస్తుందని అన్నయ్య చిరంజీవి నిన్న మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ''ఇటీవల విడుదలైన'రచ్చ' చిత్రం ఆడియో మంచి విజయం సాధించింది, సినిమా కూడా అంచనాలను రీచ్ అయింది.... గబ్బర్ సింగ్ చిత్రం ఆడియో కూడా ఘన విజయం సాధించడం, మాస్ మసాలా అంశాలతో సినిమా వినోదాత్మకంగా రూపొందడం అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదని, తమ కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు ఒకరి తర్వాత ఒకరు హిట్ కొట్టడం సంతోషంగా ఉందని' చిరు చెప్పారు.
నిర్మాత మాట్లాడుతూ.... ''దేవిశ్రీ ప్రసాద్ ఎక్స్‌లెంట్ గా చేసిన ఈ ఆడియోకి శ్రోతల నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుందంటే ఆడియన్స్ లో ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో తెలిసిందే. ఆడియో రిలీజ్ తర్వాత ఆడియన్స్ లో 'గబ్బర్ సింగ్'పై అంచనాలు బాగా పెరిగాయి. అందుకు తగిన విధంగానే 'గబ్బర్ సింగ్' భారీగా రూపొందుతోంది. మే రెండో వారంలో సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సమ్మర్‌లో పవన్ కళ్యాణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారు'' అని తెలిపారు.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











