వచ్చే నెల 2 లోపే రామ్‌చరణ్, ఉపాసన నిశ్చితార్థం: చిరు
రామ్ చరణ్-ఉపాసన నిశ్చితార్థం వచ్చే నెల 2వ తేదీ లోపు జరుగుతుందని, వారంలోగా ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని చిరంజీవి శనివారం చెప్పారు. బహుషా ఈ ఏడాది లోపే వాళ్ల పెళ్లి జరుగవచ్చని వ్యాఖ్యానించారు. రక్షాబంధన్ సందర్భంగా చిరంజీవికి రాఖీ కట్టడానికి హైదరాబాద్ నగర మేయర్ బండ కార్తీక రెడ్డి ఆయన నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు చిరంజీవి సమాధానాలు ఇచ్చారు. నా బర్తడే రోజున పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని, స్వర్గీయ రాజీవ్ గాంధీ పుట్టిన రోజు నాడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని తెలిపారు.
రెండు రోజుల క్రితం తిరుపతిలో మీడియా అడిగిన ప్రశ్నకు....'చరణ్ పెళ్లికి ఇప్పుడే తొందర లేదు" అని వ్యాఖ్యానించిన చిరంజీవి, ఇంత త్వరగా చరణ్ పెళ్లి విషయం మాట మార్చడంపై అనేక సందేహాలు తలెత్తాయి.చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకోవడం చిరంజీవికి ఇష్టం లేదని, అందుకు నిరసనగా చెర్రీ ఉపవాస దీక్షకు దిగాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా చిరంజీవికి కులం కూడా అంటగడుతూ వార్తలు రాశారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి, ఊహాగానాలకు తెరవేయడానికి చిరంజీవి వారి నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించినట్లు చెబుతున్నారు. వ్యతిరేక వార్తల వల్ల తన ప్రతిష్ట దెబ్బ తినే ప్రమాదం ఉందని, దానికి అవకాశం ఇవ్వకూడదని భావించారని అంటున్నారు.


Click it and Unblock the Notifications











