తాను నటించబోయే కొత్త సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి సెకండ్ థాట్ లో పడ్డాడట. ఒక స్వాతంత్ర్య సమరయోధుడి కథను ఆధారం చేసుకుని నిర్మించాలని తలపెట్టిన ఆ సినిమాను చేయాలా, వద్దా అనే మీమాంసలో పడ్డట్లు వినికిడి. ఇందుకు కారణం బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు సినిమానే కారణమని టాలీవుడ్ వర్గాలంటున్నాయి. ఒక్క మగాడు బాక్సాఫీసు వద్ద ఆశించిన మేరకు ఫలితం సాధించకపోవడంతో చిరంజీవి తన కొత్త ప్రాజెక్టును చేపట్టేందుకు కాస్తా వెనకాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. చిరంజీవి రాజకీయ ప్రవేశంపై వార్తలు వెలువడుతున్న తరుణంలో, వ్యక్తిగత సమస్యలు ఎదుర్కున్న స్థితిలో ఇప్పుడు చిరంజీవికి ఘన విజయం సాధించే సినిమానే కావాలి.