చిరు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వందేమాతరం’...
తన రాజకీయ ప్రస్థానానికి ఊతమిచ్చేలా..అభిమానుల్లో మళ్ళీ ఊపు తెచ్చేలా ఓ సినిమా చేసి తీరాలనే నిర్ణయానికి వచ్చారట మెగాస్టార్ చిరంజీవి. కాగా ఆ మెగా ప్రాజెక్ట్ ని కరెక్ట్ గా డీల్ చేసేందుకు ఓ ముగ్గురు దర్శకులను ఎంచుకుపన్న చిరు ఇఫ్ఫుడు ఒన్ బై ఒన్ ఆ ముగ్గురు డైరెక్టర్స్ తోనూ డిస్కషన్స్ జరుపుతున్నారు. 'మగధీర" తో నటుడిగా 149 చిత్రాలు పూర్తి చేసుకున్నచిరంజీవి ఆ ఒక్క సినిమా చేసి 150వ ల్యాండ్ మార్క్ రీచ్ అవడానికి తహతహలాడుతున్నట్టు సమాచారం. తీరిక దొరికినప్పుడల్లా ఈ సెంచరీన్నర ఎటెంప్టులు చేయడం చిరంజీవికి పరిపాటిగా మారింది. అయితే తెరచాటు వ్యవహారాలు మాని ముసుగు ఎప్పుడు తొలగిస్తారనేదే ఆసక్తి రేకెత్తిస్తోంది.
చిరంజీవి ఇటీవల కృష్ణవంశీని కలిసి చాలా సేపు చర్చించినట్టు తెలిసింది. అలాగే సినిమా చేయడానికి సంపిద్దత వ్యక్తం చేస్తూ తనకి సన్నిహితులైన కొందరు దర్శకులకి సంకేతాలు పంపినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తన డ్రీమ్ ప్రెజెక్ట్ 'వందేమాతరం" గురించి మాట్లాడం జరిగింది. మరి ఆ కథాంశం పట్ల మెగా స్పందన ఏమిటో మెగా మూవీని టేకప్ చేసే దర్శకుడు ఎవరవుతారో తేలాలంటే మనం ఇంకాస్త వేచి చూడాల్సిందే..!


Click it and Unblock the Notifications











