మెగాస్టార్ చిరంజీవి తన సెక్యూరిటీని పెంచుకున్నాడు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులకు మల్లే చిరంజీవికి కూడా సెక్యూరిటీని అందించడానికి పోలీసులు సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఇద్దరు వ్యక్తుల సెక్యూరిటీ చిరంజీవికి అందించారు. సెక్యూరిటీని పెంచాల్సిందిగా చిరంజీవి పోలీస్ కమిషనర్ ను కోరినట్టుగా కూడా తెలుస్తోంది.