పవన్ ఫ్యాన్స్ కు చిరు..'ధాంక్స్' లెటర్స్
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ అభిమానులను చిరంజీవి లెటర్స్ ద్వారా పలకరించారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా బ్లడ్ క్యాంప్ లో పాల్గొన్న వారందిరీకీ ఆయన దాంక్స్ చెప్తూ ఉత్తరాలు పంపారు. సెప్టెంబర్ 2న మెగా ప్యాన్స్ ఆర్గనైజేషన్ మెగా బ్లడ్ క్యాంప్ ని చిరంజీవి ఐ హాస్పటిల్,హైదరాబాద్ వద్ద నిర్వహించారు. వందలాది మెగా అభిమానులు ఈ క్యాంప్ లో పాల్గొని తమ రక్తం డొనేట్ చేసారు. దాంతో వారందరకీ మరింత ఉత్తేజాన్ని ఇవ్వటానికి "మా సోదరుడు పుట్టిన రోజున రక్త దానం చేసనందుకు కృతజ్ఞతలు- మీ చిరంజీవి" అంటూ ఉత్తరాలు పంపారు. దాంతో పవన్ ఫ్యాన్స్ ఉత్తరాలు తమ బ్లాగుల్లో,మైక్రో బ్లాగ్ సైట్స్ తో పెట్టుకుని మరిసిపోతున్నారు.
మరో ప్రక్క ఆ అబిమానలు చిరంజీవి 150 వ చిత్రం కోసం ఎదురుచూస్తున్నామంటున్నారు. చిరంజీవి 150 వ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి 'నాయకుడే సేవకుడు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని ఇప్పటికే ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ కూడా చేయించారు. అయితే వినాయిక్ చెప్పిన కథలు ఏమీ ఇంప్రెస్ చేయకపోవటంతో చిరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెప్తున్నారు.
చిరంజీవి రాజకీయ భవిష్యత్‌కు ప్లస్సయ్యేలా ఈ చిత్రాన్ని రూపొందించే అవకాసం ఉంది. ఈచిత్రాన్ని స్వయంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ నిర్మించనున్నారు. ఎంటర్‌టైన్మెంట్ విత్ పాలిటిక్స్ జోడించి సందేశాత్మకంగా ఈ చిత్రానికి సంబంధించిన కథను తయారు చేస్తున్నారు. 150వ చిత్రం...పైగా చిరంజీవి సినీ జీవితంలో చివరి చిత్రంగా దీన్ని రూపొందిస్తుండటంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వందల కొద్ది కథలను పరిశీలించారు...ఇంకా పరిశీలిస్తున్నారు. త్వరలోనే కథ ఖరారు కానుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే రోజు కూడా ఎంతో దూరంలో లేదు.


Click it and Unblock the Notifications











