ఇండస్ట్రీ పెద్ద పదవి నాకొద్దు.. ఆ పంచాయితీలు నేను చేయను.. మెగాస్టార్ చిరంజీవి సంచలనం
తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ పెద్దదిక్కుగా ఉండలేనని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఈ మేరకు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

50 శాతం రాయితీతో
సినీ పరిశ్రమలో ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా మెగాస్టార్ చిరంజీవి తాను ఉన్నాను అని ముందుకు వస్తారు. సినీ పరిశ్రమలోని వారికే కాదు సామాన్య మానవులకు కూడా తనకు చేతనైన విధంగా బ్లడ్ బ్యాంక్ బ్యాంక్ స్థాపించి సేవలు అందిస్తూ వస్తున్నారు ఆయన. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసి ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండటానికి తన వంతు ప్రయత్నం చేశారు మెగాస్టార్ చిరంజీవి.
ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన యోదా డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం సమయంలో ఆ డయాగ్నస్టిక్ సెంటర్ యజమాని సినీ కార్మికుల కోసం ఏదైనా చేయాలని చిరంజీవి కోరడంతో వారికి 50 శాతం రాయితీతో టెస్టులు చేయించుకునే అవకాశం ఇస్తామని సదరు సంస్థ ప్రకటించింది.

ప్రత్యేకంగా హెల్త్ కార్డులు
అయితే సదరు సంస్థ ప్రకటించిన విధంగా ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు లైఫ్ టైం హెల్త్ కార్డులను మెగాస్టార్ చిరంజీవి పంపిణీ చేశారు. సినీ పరిశ్రమలో ఉన్న 18 విభాగాలకు చెందిన వారికి ఈ హెల్త్ కార్డులు పంపిణీ జరిగింది. ఈ కార్డుల పంపిణీ అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ కరోనా అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితం అతలాకుతలం అయిపోయింది అని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో నా వంతు సహాయం నేను చేశాను సినీ పరిశ్రమకు కూడా ఏమైనా చేయాలి అని యోదా డయాగ్నస్టిక్ సెంటర్ వారిని అడిగితే వాళ్ళు వెంటనే ఓకే అన్నారు అని వారి డయాగ్నొస్టిక్ సెంటర్ లో ఉన్న సేవలు 50 శాతం రాయితీతో వినియోగించుకునేలా సినీ పరిశ్రమలో కార్మికులకు ప్రత్యేకంగా హెల్త్ కార్డులు పంపిణీ చేయడానికి ముందుకు వచ్చారు అని చెప్పుకొచ్చారు.

క్యూఆర్ కోడ్
ఇక ఇప్పుడు పంపిణీ చేస్తున్న హెల్త్ కార్డులో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందని ఆ క్యూఆర్ కోడ్ లో కార్డు కు చెందిన వారితో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలు కూడా నమోదు అయి ఉంటాయని అన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 18 యూనియన్ల వారికి సంబంధించిన కార్డులు దాదాపు 7700 కార్డులు రెడీ అవగా వాటిని పంపిణీ చేస్తున్నామని మిగతావి ఈ నెలాఖరులోపు రెడీ అవుతాయి అని చెప్పుకొచ్చారు ఈ కార్డుల ద్వారా యోధా డయాగ్నస్టిక్ సెంటర్ లో సినీ పరిశ్రమకు చెందిన వారు 50 శాతం రాయితీతో పరీక్షలు చేయించుకోవచ్చు అని చెప్పుకొచ్చారు.

బాధ్యతగా ఉంటా
ఇక ఈ క్రమంలోనే తెలుగు సినీ పరిశ్రమ మీద మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాసరి నారాయణరావు మరణం తర్వాత మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారని అందరూ భావిస్తున్న తరుణంలో నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దని కాదు అని ఆ పదవిలో ఉండలేను అని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. అవసరానికి అండగా ఉంటాను అని ఆయన పేర్కొన్నారు. బాధ్యతగా ఉంటానన్న చిరంజీవి సమస్యలు వస్తే మాత్రం సాయం చేస్తానని చెప్పుకొచ్చారు.
Recommended Video

వచ్చే ప్రసక్తే లేదు
అనవసరంగా ప్రతి దానికి నేను ఉన్నాను అని తగుదునమ్మా అని వచ్చే ప్రసక్తే లేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరైనా ఇద్దరు వచ్చి మేం కొట్టుకున్నాం, మీరు సమస్య తీర్చాలి అంటే ఇలాంటి విషయాలు తనకు అవసరం లేదని ఆయన అన్నారు. ఏదైనా సమస్య అది ఆరోగ్య సమస్య, కానీ ఉపాధి సమస్య కానీ ఎలాంటి సమస్య అయినా తాను అండగా ఉంటానని బాధ్యతగా ఉంటానని అన్నారు. ఇండస్ట్రీ కోసం కచ్చితంగా తన భుజం ఎప్పుడూ సినీ పరిశ్రమ కోసం అండగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











