చిరంజీవి 150 స్టోరీ వివాదం సెటిలైంది

By Bojja Kumar

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గత నెలలో గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన 'కత్తి' చిత్రానికి రీమేక్ గా వివి వినాయక్ దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా స్టోరీపై కొన్ని రోజులుగా వివాదం ఉన్న సంగతి తెలిసిందే.

తమిళ 'కత్తి' చిత్రం స్టోరీ తనదే అంటే ఎం.నరసింహారావు అనే రచయిత చాలా కాలంగా పోరాటం చేస్తున్నారు. ఇపుడు అదే కథను తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తుండంతో వివాదం మరింత హైప్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ జరగనిచ్చేది లేదంటూ గతంలో ఆయన ఆందోళన కూడా చేసాడు. ఈ స్టోరీపై ఆయన రైటర్స్ అసోసియేషన్లో పిర్యాదు కూడా చేసారు.

గత నెలలో జరిగిన 150వ సినిమా ప్రారంభోత్సవానికి నరసింహరావును ఆహ్వానించక పోవడంతో ఆయన కోర్టుకు వెళ్లేందుకు సైతం సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా పోస్టర్స్, టైటిల్స్ లో తనకూ క్రెడిట్ ఇవ్వాలని, రచయితగా తన పేరు వేయాలని, దీంతో పాటు తనకు రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ వివాదాన్ని పెద్దగా చేయడం ఇష్టంలేక ఆయన కోరినట్లుగా చేసేందుకు చిరంజీవి అంగీకరించినట్లు సమాచారం.

Chiranjeevi Settles 150 movie story Controversy

ఏప్రిల్ 29 మధ్యాహ్నం గం.1.30ని.లకు పూజా కార్యక్రమాలతో చిరంజీవి 150వ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. చిరంజీవి కెరీర్లో మైల్ స్టోన్ మూవీ కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండటం మరో విశేషం. ఇందుకోసం రామ్ చరణ్ 'కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ' అనే సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించారు.

గతంలో చిరంజీవికి ఠాగూర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన వివి వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గత నెలలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముహూర్తపు సన్నివేశానికి పరచూరి వెంకటేశ్వరరావు క్లాప్ కొట్టారు. నాగబాబు గౌరవ దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్విచ్ ఆన్ చేసారు.

సౌత్ లో టాప్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు చిరంజీవిని తన కెమెరా ద్వారా మరింత స్టైలిష్ గా చూపించబోతున్నారు. టాలీవుడ్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న దేవి శ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించనున్నారు. చిరంజీవి గత చిత్రాలు శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకు దేవిశ్రీ విజయవంతమైన సంగీతం అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X