డాన్స్: ప్రభుదేవా బెస్ట్ లిస్టులో చిరంజీవి, మరో హీరో!

ప్రస్తుతం దర్శకుడిగా తన సత్తా ఏమిటో చూపించే పనిలో ఉన్నాడు ప్రభుదేవా. ఇటీవల బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్‌తో 'ఆర్..రాజ్ కుమార్' సినిమా తెరకెక్కించిన ప్రభుదేవా ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.......తన బెస్ట్ డాన్సర్ల లిస్టులో తెలుగు స్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ ఫేవరెట్ అని వ్యాఖ్యానించాడు.
ప్రస్తుతం దర్శకుడిగా ప్రభుదేవా బాలీవుడ్లో దూసుకెలుతున్నాడు. ఆయన దర్శకత్వంలో బాలీవుడ్లో వచ్చిన వాంటెడ్, రౌడీ రాథోడ్, ఆర్...రాజ్ కుమార్ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం ఆయన తన నెక్ట్స్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. తర్వాతి సినిమాను ఆయన బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్‌తో కలిసి చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications