అప్పుడు జాయ్ ఫుల్ లైఫ్.. ఇప్పుడు జైల్.. వంటగదిలో మెగాస్టార్ చతురత

సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి అడుగుపెట్టినప్పటి నుంచి మొదలైన జోష్‌ ఇప్పట్లో తగ్గేటట్టూ కనిపించడం లేదు. ట్విట్టర్, ఇన్స్‌టాగ్రామ్ వేదికలుగా చిరంజీవి విభిన్నమైన పోస్టులతో ఆకట్టుకొంటున్నాడు. తన గత అనుభవాలను, ప్రస్తుత అనుభూతులను మేలవించి రఫ్ ఆడిస్తున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో చిరంజీవి పెడుతున్న పోస్టులు వైరల్ అవుతున్నాయి. తాజాగా చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇంతకు ఆ ఫోటో కథ ఏమిటంటే..

ఇన్స్‌టాగ్రామ్‌లో అరుదైన విషయాలతో

ఇన్స్‌టాగ్రామ్‌లో అరుదైన విషయాలతో

ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ తెరిచినప్పటి నుంచి చిరంజీవి తమ అభిమానులకు ఎనలేని సంతోషాన్ని ఇస్తున్నారు. గతంలోని తన అనుభవాలను, ఇప్పటి వరకు ఫ్యాన్స్ తెలియని విషయాలను మెగాస్టార్ పంచుకొంటున్నారు. అరుదైన, ఇంత వరకు ఎవరూ చూడని ఫోటోలను షేర్ చేస్తూ ఉత్సాహపరుస్తున్నారు.

ఛాలెంజ్ స్వీకరించిన మెగాస్టార్

ఛాలెంజ్ స్వీకరించిన మెగాస్టార్


తాజాగా లాక్‌డౌన్‌లో తోటి సినీ ప్రముఖులు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించారు. ప్రొఫెషనల్ చెఫ్‌లా ఇంటి కిచెన్‌లోకి ప్రవేశించి టాలెంట్‌ను చూపించారు. చక్కగా దోశెలు వేసి ఆకట్టుకొన్నారు. ఆ తర్వాత ఆ దోశెలను తల్లికి తినిపించబోగా.. స్వయంగా చిరంజీవి అంజనాదేవి తినిపించి ప్రేమను చాటుకొన్నారు.

1990 పర్యటనలో భార్యతో చిరంజీవి

1990 పర్యటనలో భార్యతో చిరంజీవి

ఇక తాజాగా 1990లో అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడి ఉన్న ఇంటిలో వంట చేసిన ఫోటోను షేర్ చేశాడు. నా జీవితంలో అది సంతోషంతో కూడిన హాలీవుడ్. ఆమెరికాలోని మేము ఉన్న రిసార్టులోని ఓ ఇంటిలో నేను వంట చేసిన దృశ్యం. తాను.. నేను.. కాలం మారినా.. దేశం మారినా.. మేము మారలేం అంటూ చిరంజీవి తన ఫోటో కింద ట్యాగ్ లైన్ రాశారు.

2020లో సతీమణితో చిరంజీవి

2020లో సతీమణితో చిరంజీవి


అలాగే 2020లో తన ఇంటిలో వంట చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. ఇది జైలు లాంటి హాలీడే. కరోనా సమయంలో జీవితం ప్రశాంతంగా ఉన్నప్పటికీ.. జైలులో ఉన్న ఫీలింగ్ కలుగుతున్నది. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనావైరస్ వ్యాప్తిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబంతో కలిసి చిరంజీవి అనుభూతులు పంచుకొంటున్నారు.

Recommended Video

Rana Daggubati Engaged To Miheeka Bajaj| Tollywood Funniest Wishes
చిరంజీవి ఆచార్య గురించి

చిరంజీవి ఆచార్య గురించి

చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఆచార్య సినిమా ప్రస్తుతం సెట్‌పైన ఉంది. తనయుడు రాంచరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రాంచరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన 30 నిమిషాల నిడివి ఉన్న నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారు. అయితే రాంచరణ్ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X