For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్ మూవీకి వెళ్తే కొట్టారు.. ఆ పేరు చెప్తేనే వణుకొస్తుంది: సీక్రెట్ లీక్ చేసిన చిరంజీవి

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్‌తో తిరుగులేని శక్తిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమ కోసం ఎన్నో అద్భుతమైన పనులు చేస్తున్నారు. అలాగే, చిన్న సినిమాలను సైతం ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం విడుదల కాబోతున్న 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ పాల్గొన్నారు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించిన చిరంజీవి.. తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని కూడా పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఓ టాప్ సీక్రెట్‌ను లీక్ చేశారు. దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

  ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ వస్తున్నారు

  ఫస్ట్ డే ఫస్ట్ షో అంటూ వస్తున్నారు

  శ్రీకాంత్ రెడ్డి, సంచిత జంటగా నటించిన చిత్రమే 'ఫస్ట్ డే ఫస్ట్ షో'. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమాకు అనుదీప్ కేవీ కథను అందించాడు. ఇక, ఈ చిత్రాన్ని లెజెండరీ ప్రొడ్యూసర్ ఏడిద నాగేశ్వర్రావు మనవరాలు శ్రీజ నిర్మించారు. ఈ మూవీకి రాధాన్ సంగీతాన్ని అందించారు. ఇందులో వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు.

  ఆ సీరియల్ నటితో ప్రేమలో పడ్డ హైపర్ ఆది: ఆ షోలో బయటపెట్టిన కమెడియన్

  విడుదలకు రెడీ.. ప్రమోషన్స్ స్పీడ్

  విడుదలకు రెడీ.. ప్రమోషన్స్ స్పీడ్

  క్రేజీ సబ్జెక్టుతో ఫుల్ లెంగ్త్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీని సెప్టెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మరింత స్పీడు చేసేసింది. ఇప్పటికే చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూలు, ఈవెంట్లను కూడా నిర్వహించింది. ఫలితంగా ఈ మూవీ జనాల దృష్టినీ మరింతగా ఆకర్షిస్తోంది.

  ప్రీ రిలీజ్ ఈవెంట్.. చిరుతో వాళ్లు

  ప్రీ రిలీజ్ ఈవెంట్.. చిరుతో వాళ్లు


  శుక్రవారం విడుదల కాబోతున్న 'ఫస్ట్ డే ఫస్ట్ షో' మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. చిరుతో పాటు ఈ ఈవెంట్‌కు శ్రీకాంత్, అలీ కూడా గెస్టులుగా వచ్చారు.

  అషు రెడ్డి అందాల ప్రదర్శన: ఏకంగా షర్ట్ విప్పేసి మరీ చూపిస్తూ!

  చిరు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనుభవం

  చిరు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనుభవం

  'ఫస్ట్ డే ఫస్ట్ షో' ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి తన ఫస్ట్ డే ఫస్ట్ షో అనుభవాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాకు కూడా ఫస్డ్‌ డే ఫస్ట్‌ షో అనుభవం ఉంది. అయితే పరువు పోతుందేమో అని ఇది ఎక్కడా చెప్పుకోలేదు. నెల్లూరులో సంవత్సరం గుర్తు లేదు కానీ ఆ సినిమా పేరు ఏవీఎమ్ వారి రాము. ఎన్టీఆర్ గారు నటించిన సినిమా అది' అని చెప్తారు.

  నేల టికెట్‌కు వెళ్తే నలిగిపోయాడు

  నేల టికెట్‌కు వెళ్తే నలిగిపోయాడు

  చిరంజీవి కంటిన్యూ చేస్తూ.. 'మా చుట్టాలబ్బాయికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. వాడితో ఆ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లాం. నాన్నగారు మమ్మల్ని కుర్చీ రేంజ్‌లోనే సినిమాలు చూపించేవారు. కానీ ఆ రోజు నేల టికెట్‌కు వెళ్లాల్సి వచ్చింది. నాతో పాటు తమ్ముడు నాగబాబు కూడా సినిమాకు వచ్చాడు. టికెట్లు తీసుకొనే క్రమంలో రద్దీ వల్ల వాడు నలిగిపోయాడు' అని వెల్లడించారు.

  శృతి మించిన సీరియల్ నటి హాట్ షో: ఇలాంటి ఫొటోలు ఎప్పుడూ చూసుండరు!

  నాన్నకు అక్కడే దొరికిపోయామని

  నాన్నకు అక్కడే దొరికిపోయామని

  చిరంజీవి మాట్లాడుతూ.. 'టికెట్ తీసుకునే సమయంలో ఒత్తిడి వల్ల మాకు ఊపిరి ఆగిపోయినంత పనైంది. ఎలాగోలా టికెట్లు తీసుకుని బయటకు వచ్చాం. అప్పుడు నాగబాబు చమటలు పట్టి భయపడిపోతున్నాడు. దీంతో మాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే నాన్న గారు, అమ్మ అంతకు ముందు షో చూసి బయటకు వచ్చారు. దీంతో మేము ఆయనకు దొరికేశాం' అని అన్నారు.

  అక్కడి నుంచి కొడుతూ వచ్చారు

  అక్కడి నుంచి కొడుతూ వచ్చారు

  ఆ తర్వాత ఏం జరిగిందో చెబుతూ.. 'నాన్న గారు మమ్మల్ని చూసిన వెంటనే కోపంతో ఊగిపోయారు. నాగబాబు పరిస్థితిని ఆయన నన్ను కొట్టడం మొదలుపెట్టారు. అలా అక్కడి నుంచి ఇంటికి వచ్చే వరకూ రోడ్డు మీద కొడుతూనే ఉన్నారు. అందుకే ఇప్పటికీ ఏవీఎమ్ రాము సినిమా అంటే నాకు వణుకు వచ్చేస్తుంది' అంటూ చిరంజీవి తన పర్సనల్ సీక్రెట్‌ను రివీల్ చేశారు.

  English summary
  Megastar Chiranjeevi Recently Participated in First Day First Movie Pre Release Event. He Shares his First Day First Show Experience in An Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X