చిరంజీవి..ఆంజనేయస్వామి
చిరంజీవి ఈ మద్య తనకూ ఆంజనేయ స్వామికీ ఉన్న రిలేషన్ చెప్పుకొచ్చారు. ఆయన మాటల్లేనే..నేను ఆ హనుమంతుడికి వీర భక్తుడ్ని. నేను ఎనిమిదవ తరగతి చదివేటప్పుడు మా వూరి పూజారి నాకు హనుమాన్ చాలీసా నేర్పాడు. అప్పటి నుంచీ ఏ సమస్య వచ్చినా దానని చదువుకోవటం అలవాటు. ఇక నేను చెన్నైలో సినిమాల కోసం ట్రై చేస్తున్నప్పుడు రోజూ అన్ని ఆంజనేయదేవాలయాలు తిరిగేవాడ్ని. అప్పటికి నా అసలు పేరు శివ శంకర వర ప్రసద్. ఆ తర్వాత నేను చిరంజీవి అని పేరు మార్చుకున్నా. అది ఆ హనుమంతుడు మరో నామధేయం. ఆ తర్వాత నా ఎంట్రీ, ఎదుగుదల క్రమంగా ఏ సమస్యా లేకుండా జరిగిపోయాయి. ఇక నా నమ్మకం భగవంతుడు అన్న వైపుల నుంచీ మనం చేసే పనులును గమనిస్తూ ఉంటాడని..మనం మరణించాక వాటిని జడ్జ్ చేస్తాడని. అలాగే ప్రతీ రోజు హనుమంతుడు ప్రార్ధన చేయందే రోజు ప్రారంభించను. అందులోనూ నా తల్లి పేరు కూడూ అంజనీదేవి(హనుమంతుడు తల్లి పేరూ అదే) కావటంతో భక్తి మరింత పెరిగింది. అలాగే ప్రతి సంవత్సరం నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి తిరుమల వెళ్తూంటాను. అయినా నా మటుకు నాకు ప్రతీవారిలోనూ భగవంతుడు ఉన్నాడనే నమ్ముతాను. అయితే కొందరు దేముడు ఉన్నాడని నమ్మరు. వారిని నేను తప్పు పట్టను గానీ..దేముడు లేనిదే ఈ సృష్టి ఎలా ఏర్పడింది అని అడగాలనిపిస్తుంది. ఏదైమైనా మతాన్ని తమ సొంత పనులు కోసం అడ్డం పెట్టుకున్నప్పుడు మాత్రమే సమస్యలు వస్తూంటాయి..అంటూ ముగించారు.


Click it and Unblock the Notifications











