హాట్ టాపిక్: స్టార్ హీరోలపై చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్.. ఆయన ఆ మాటలు అన్నది ఎవరిని.?
మెగాస్టార్ చిరంజీవి... ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. దాదాపు మూడు తరాలుగా ఆయన.. తెలుగు తెరపై తిరుగులేని హీరోగా వెలుగొందుతున్నారు. ఎన్టీఆర్, ఏఎన్సార్, కృష్ణ, శోభన్ బాబు స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న సమయంలోనే తన సత్తా చూపించి సుప్రీమ్ హీరో అనిపించుకున్నారు. ఇక, రాజకీయాల్లోకి వెళ్లి చాలా ఏళ్లు గ్యాప్ తీసుకున్న ఆయన.. రీఎంట్రీలోనూ అదరగొడుతున్నారు. సినిమా హీరోగానే కాకుండా ఇండస్ట్రీ పెద్దగానూ వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరు.. స్టార్ హీరోలపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వివరాల్లోకి వెళితే...

గ్యాప్ వచ్చినా ఆయనలో ఏమాత్రం తగ్గలేదు
చిరంజీవి చాలా కాలం పాటు టాలీవుడ్ టాప్ హీరోగా వెలుగొందారు. అయితే, కొన్నేళ్ల క్రితం ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు పదేళ్ల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150'తో ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అంచనాలకు తగ్గట్లే సూపర్ హిట్ అవడంతో పాటు చిరంజీవిలోని గ్రేస్, టైమింగ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిన తండ్రి కొడుకులు
‘సైరా' ఫలితంతో ఢీలా పడ్డ చిరంజీవి, రామ్ చరణ్.. ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిపోయారు. ఇందులో భాగంగానే బడా డైరెక్టర్ కొరటాల శివతో మూవీ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. చెర్రీతో పాటు మ్యాట్నీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఇండస్ట్రీకి పెద్దన్నగా మారిన మెగాస్టార్ చిరంజీవి
ఒకపక్క తన సినిమాల షూటింగుల్లో బిజీగా గడుపుతూనే మరోవైపు తమకు గుర్తింపును తీసుకొచ్చిన తెలుగు సినీ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి పెద్దన్నగా వ్యవహరిస్తున్నారు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో సమస్యలను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ఆయన.. సినిమా అభివృద్ధికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతోనూ సమావేశం అయ్యారు.

ఆ విషయంలో అందరివాడు అనిపించుకుంటున్నాడు
చిరంజీవి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బిజీ బిజీగా గడుపుతున్నారు. తన సినిమాల పనులను సైతం పక్కన పెట్టేసి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా చిన్న సినిమాలకు ప్రమోషన్ చేశారు. అలాగే, స్టార్ హీరోల మూవీలకు సైతం సాయం అందించారు. అందులో సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ ‘సరిలేరు నీకెవ్వరు' కూడా ఉంది.

తెలుగు హీరోలపై చిరు సెన్సేషనల్ కామెంట్స్
తాజాగా చిరంజీవి.. ‘ఓ పిట్ట కథ' అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆవేదనాపూరితంగా మాట్లాడారు. ‘కొందరు హీరోలు టైమ్‌ను అస్సలు ఫాలో అవడం లేదు. షూటింగ్ గ్యాప్ వస్తే క్యారీ వ్యాన్ ఎక్కేస్తున్నారు. అందుకే సినిమా షూటింగ్‌లు ఆలస్యం అవుతున్నాయి. అందరూ బాధ్యతగా చేస్తే నిర్మాతకు చాలా డబ్బులు మిగులుతాయి' అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Recommended Video


చిరు కామెంట్లపై సినీ ప్రియుల రియాక్షన్ ఇదే
కొందరు స్టార్ హీరోలు చేస్తున్న పని వల్ల సినిమాలు ఆలస్యం అవుతున్నాయని చిరంజీవి చేసిన కామెంట్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాకు చేరింది. దీంతో ఆయన అన్నది ఎవరిని అన్న చర్చ నడుస్తోంది. అదే సమయంలో నిర్మాత బాగు కోసం మాట్లాడిన చిరంజీవికి మద్దతు తెలపడంతో పాటు అభినందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











