Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సైరా కోసం చిరు మేకోవర్: లుక్‌లోనే ఆ కష్టం తెలిసిపోతోంది
డిసెంబర్ 6 నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తికాగా, చిరు కూడా సైరా కోసం తన మేకొవర్‌ని పూర్తిగా మార్చుకున్నాడు. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ జిమ్‌లో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నాడట. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా మెగాస్టార్ తన బాడీ షేప్ ను మార్చుకున్నారని , తప్పకుండా సినిమాలో ఆయన అందరికి నచ్చేలా కనిపిస్తారని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది.
షూటింగ్ తొలి షెడ్యూల్
1840 నాటి కథకి తగ్గట్టుగా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో భారీ సెట్ నిర్మించాడు. ఇందులో షూటింగ్ తొలి షెడ్యూల్ మొదలు కానుందని సమాచారం. హైదరాబాద్, పొలాచ్చి, రాజస్థాన్లతో పాటు పలు భారీ ప్రాంతాలలో భారీ సెట్స్ నిర్మిస్తున్నారు.
భారీ బడ్జెట్ చిత్రం
పీరియాడియకల్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందనుందని తెలుస్తుంది. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చా సుదీప్, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషించనున్న సంగతి తెలిసిందే.
సైరా సినిమా కోసం
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ 150వ సినిమా కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అంతకంటే ఎక్కువ స్థాయిలో తన నెక్స్ట్ సినిమా కోసం చిరు చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించబోతోన్న సైరా సినిమా కోసం చిరు ఫిటెనెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
మెగాస్టార్ ఫస్ట్ లుక్
రామ్ చరణ్ కూడా తండ్రితో పాటు జిమ్ లో పాల్గొంటున్నాడు. డిసెంబర్ 6న రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రెడీగా ఉన్నాడు. అయితే మెగాస్టార్ ఫస్ట్ లుక్ కోసం చాలా కష్టపడుతున్నారు.
కరెక్ట్ గా సెట్ అయ్యేలా
రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటోని చూస్తే మనకే అర్ధమవుతోంది. ఆరు పదుల వయసు దాటినా కూడా మెగా స్టార్ ఒక యోధుడిగా కనిపిస్తున్నాడు అనే భావన కలుగుతోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రకు కరెక్ట్ గా సెట్ అయ్యేలా మెగాస్టార్ తన బాడీ షేప్ ను మార్చుకున్నారు.
అల్యూమినియం ఫ్యాక్టరీలో
తప్పకుండా సినిమాలో ఆయన అందరికి నచ్చేలా కనిపిస్తారని చిత్ర యూనిట్ చాలా నమ్మకంతో ఉంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ లో వేసిన ఒక సెట్ లో సినిమా మొదటి షూట్ స్టార్ట్ కానుంది. నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి అందుకు ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు.