Vishwambhara Business: విశ్వంభరకు రికార్డు బిజినెస్.. పాన్ ఇండియా రేంజ్‌లో మెగాస్టార్ చిరంజీవి మూవీ రైట్స్!

ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ అని చెప్పేవాళ్ళు కానీ ఆ ఇద్దరు ఎరాలో ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికీ కూడా తిరుగు లేని హీరోగా నిలిచింది మాత్రం ఒక్క మెగాస్టార్ చిరంజీవే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో మెగాస్టార్ చూడని హిట్ లేదు ప్లాప్ లేదు. తెలుగు సినిమా ట్రెండ్ లో వెళుతున్న తరుణంలో మెగాస్టార్ తన గ్రేస్ తో తెలుగు సినిమా ముఖాన్ని మార్చేశారు.

హిందీ, తమిళ్ లో కూడా క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉన్నప్పటికీ తెలుగు సినిమాలోనే ఉంటూ టాలీవుడ్ ఖ్యాతిని మరో లెవెల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మొదటి నుంచీ మెగాస్టార్ చేస్తున్నారు. అయితే మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినా కొంచెం వింతగా ఉంటుంది అని చెప్పాలి. తను అప్పట్లోనే స్టార్ గా మారినప్పుడు అప్పటి ట్రెండ్ కి హైయెస్ట్ వసూళ్లు ఎలాగైతే తెలుగు స్టేట్స్ లో ఓ హీరోకి నమోదు అయ్యేవో ఇప్పటికీ అదే మార్కెట్ ని తరాలు మారినా మారుతున్న ట్రెండ్ తో పెంచుకుంటూ వెళ్ళింది ఒక్క మెగాస్టార్ మాత్రమే అని తన తాజా చిత్రం "విశ్వంభర" ప్రూవ్ చేస్తుంది.

chiranjeevi shows his boxoffice stamina in telugu states with vishwambhara

ప్రస్తుతం తెలుగులో ఎంతమంది పాన్ ఇండియా హీరోలు అయినా ఉండొచ్చు కానీ మెగాస్టార్ స్టామినా ఇప్పటికీ వాళ్ళకి ధీటుగా ఉందని విశ్వంభర బిజినెస్ చూపిస్తుంది. ఒక్క సరైన సినిమా చిరుకి పడితే దాని లాంగ్ రన్ బాక్సాఫీస్ వసూళ్లు ఎలా ఉంటాయో చూపిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందుకే భోళా శంకర్ లాంటి డిజాస్టర్ ఇచ్చినా చిరు నెక్స్ట్ సినిమా విశ్వంభర తెలుగు రాష్ట్రాల్లో తన నెక్స్ట్ జెనరేషన్ స్టార్ హీరోల పాన్ ఇండియా సినిమాలకి ధీటుగా ఇంకా చెప్పాలంటే మించే బిజినెస్ ని తెలుగు స్టేట్స్ లో చేస్తుందట.

కాగా విశ్వంభర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 120 కోట్ల బిజినెస్ ని చేసిందట. ఇది ప్యూర్ మెగాస్టార్ మ్యాడ్నెస్ అయితే ఇదే తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం దేవర 115 కోట్లు చేసినట్టుగా తెలుస్తుంది. దీనితో ఇక్కడే మెగాస్టార్ స్టామినా తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉందో అర్ధం అవుతుంది. ఇక ఒక్క ఏపీలోనే విశ్వంభర భారీ బిజినెస్ చేసినట్టుగా తెలుస్తుంది.

దేవర సినిమాకి ఏపీలో 55 కోట్లు పలికితే విశ్వంభర కి 60 కోట్లు పలికాయట. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ 75 కోట్లతో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ప్రస్తుత హీరోల మార్కెట్ కి అది కూడా పాన్ ఇండియా సినిమాల మార్కెట్ కి ధీటుగా మెగాస్టార్ సినిమా నిలబడడం అనేది మామూలు విషయం కాదని చెప్పాలి. మరి విశ్వంభర వచ్చాక ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికి విశ్వంభర పై మంచి హైప్ నెలకొనగా ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని యువ దర్శకుడు వశిష్ట తెరకెక్కించగ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది.

More from Filmibeat

Read more about: chiranjeevi vishwambhara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X