»   » మెగా అల్లుడి సినిమా లాంచ్: చిరు క్లాప్.. 'కళ్యాణ్ దేవ్'కు రాజమౌళి విషెస్(ఫోటోలు)

మెగా అల్లుడి సినిమా లాంచ్: చిరు క్లాప్.. 'కళ్యాణ్ దేవ్'కు రాజమౌళి విషెస్(ఫోటోలు)

Subscribe to Filmibeat Telugu
మెగా అల్లుడి సినిమా లాంచ్.. చిరు క్లాప్..!

'మెగా కాంపౌండ్..' ఇండస్ట్రీలో ఇదో బ్రాండ్. ఆ క్యాంప్ నుంచి లాంచ్ అయితే చాలు ఇక 'హీరో' అనిపించుకోవడమే తరువాయి. అలా ఇప్పటికే అరడజనుకు పైగా హీరోలు ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇప్పుడా 'కాంపౌండ్' పరిధిని మరింత పెంచుతూ మరో హీరో కూడా లాంచ్ అయ్యాడు. అతనే చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్. ఈ మెగా అల్లుడి కొత్త సినిమా బుధవారం తెల్లవారుజామున లాంఛనంగా ప్రారంభమైంది..

 సినిమా విశేషాలు:

సినిమా విశేషాలు:

వారాహి చలన చిత్రం పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించనున్నారు. గతంలో 'జత కలిసే' సినిమాకు దర్శకుడిగా వ్యవహరించిన రాకేశ్ శశి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

'కళ్యాణ్ దేవ్'కు శుభాకాంక్షలు:

'కళ్యాణ్ దేవ్'కు శుభాకాంక్షలు:

నేటి ఉదయం వారాహి చలనచిత్ర ఆఫీసులో పూజా కార్యక్రమాలతో సినిమా షూటింగ్ లాంఛనంగా మొదలైంది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కార్యక్రమానికి హాజరై.. 'కళ్యాణ్ దేవ్'కు శుభాకాంక్షలు తెలిపారు.

మెగా 'క్లాప్'..:

మెగా 'క్లాప్'..:

సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా.. ముహూర్తపు షాట్‌కు మెగాస్టార్ చిరంజీవి క్లాప్ కొట్టారు. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. అలాగే సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.

 ఎవరెవరు వచ్చారు..:

ఎవరెవరు వచ్చారు..:

సినిమా ప్రారంభోత్సవంలో ఎన్వీ ప్రసాద్, గుణ్ణం గంగరాజు, కల్యాణ్ కోడూరి, అవసరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 'కళ్యాణ్ దేవ్' తొలి సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ప్రొడక్షన్ నం.12:

ప్రొడక్షన్ నం.12:

సినిమా ప్రారంభోత్సవం అనంతరం నిర్మాత సాయికొర్రపాటి మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ తమ బ్యానర్ లో తన తొలి సినిమా చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రొడక్షన్ నం.12గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి కథా కథనాలతో అందరిని ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. దర్శకుడు రాకేశ్ శశి మంచి స్క్రిప్టుతో ముందుకు వచ్చాడన్నారు.

 టెక్నీషియన్స్:

టెక్నీషియన్స్:

కెమెరామెన్: సెంథిల్ కుమార్

రచన-దర్శకత్వం: రాకేశ్ శశి
ప్రొడ్యూసర్: రజిని కొర్రపాటి
మ్యూజిక్: యోగేష్
లిరిక్స్: రెహమాన్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
స్టంట్స్: జోషువా

నటీనటులు:

నటీనటులు:

కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ల భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేశ్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయ ప్రకాశ్(తమిళ్), ఆదర్శ్, నోయెల్ సీన్, కిరీటి, భద్రం.

కళ్యాణ్ దేవ్ గురించి:

కళ్యాణ్ దేవ్ గురించి:

కళ్యాణ్ దేవ్‌కు నటన పట్ల ఇష్టంతోనే హీరోగా మారుతున్నాడు. ఇందుకోసం వైజాగ్‌లో సత్యానంద్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నాడు.గతంలో పవన్‌కల్యాణ్‌, రవితేజ, ప్రభాస్‌, వరుణ్‌తేజ్‌, జయం రవి తదితర హీరోలు సత్యానంద్‌ వద్దే శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Mega Star Chiranjeevi’s son-in-law and the most handsome looking Kalyaan Dhev’s debut film is officially launched today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu