చిన్న అల్లుడితో చిరు: మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరం (ఫోటోస్)
మెగాస్టార్ చిరంజీవి తన చిన్నల్లుడు కళ్యాణ్‌తో కలిసి ఈ సారి సంక్రాంతి గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. చిరంజీవి అల్లుడితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సంప్రదాయ పంచెకట్టులో చిరంజీవి లుక్ అదిరిపోయే విధంగా ఉంది. సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒక చోట చేరి సందడి చేశారు.

మెగాస్టార్ న్యూలుక్
ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్న చిరంజీవి మొన్నటి వరకు గడ్డం, మీసంతో కనిపించారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ ముగిసిన క్లీన్ షేవ్ తో కనిపించారు. సైరా సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలు కానుంది.

ఒక్కచోట చేరి సందడి
సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకచోట చేరి సందడి చేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిహారిక ఫోటోను ఇక్కడ చూడొచ్చు.
Recommended Video


సంక్రాంతి వేడుక
మెగా ఫ్యామిలీలో సంక్రాంతి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

హీరోగా పరిచయం అవుతున్న కళ్యాణ్
శ్రీజ భర్త కళ్యాణ్ త్వరలో హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. రాకేశ్ శశి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఫిబ్రవరిలో సెట్స్ మీదకు
కళ్యాణ్ హీరోగా పరిచయం అయ్యే చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకెళ్ళనుందని తెలుస్తోంది. ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సినిమా నేరుగా జనాల్లోకి ఈజీగా వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారట.

హీరోయిన్ ఎవరు?
ఈ చిత్రంలో ‘ప్రేమమ్' బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ని మొదట హీరోయిన్‌గా తీసుకోవాలనుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ‘లై' ఫేం మేఘా ఆకాశ్‌ని కళ్యాణ్‌కి జోడీగా తీసుకోవాలనుకుంటున్నారట.


Click it and Unblock the Notifications











