ఫోటోలు: సతీసమేతంగా చిరు, చరణ్ కాన్స్ ఫిల్మ్‌ఫెస్ట్
కాన్స్ : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీసమేతంగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌కి హాజరయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్ సూటుబూతో దర్శనం ఇస్తే.....చిరంజీవి భార్య సురేఖ, రామ్ చరణ్ భార్య ఉపాసన సంప్రదాయ చీరకట్టులో రెడ్ కార్పెట్‌పై నడిచి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
భారతీయ సినిమా 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసిన నేపథ్యంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి హోదాలో అక్కడికి వెళ్లారు. 'ఇన్‌క్రెడబుల్ ఇండియా' కార్యక్రమం బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన కాన్స్ ఫిల్మ్‌ఫెస్ట్‌లో భారతదేశంలో విదేశీ సినిమాలు చిత్రీకరించేందుకు అనువైన స్థలాలు, భారత ప్రభుత్వ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి అనే విషయాలను చిరంజీవి అంతర్జాతీయ సినీ ప్రముఖులకు వివరించారు.
భారతదేశంలో విదేశీ సినిమాలు చిత్రీకరించేందుకు అనువైన స్థలాలు, భారత ప్రభుత్వ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి అనే విషయాలను చిరంజీవి వివిధ దేశాల నుంచి వచ్చిన నిర్మాతలు, దర్శకులకు తెలియజేసారు. పలు ఆస్కార్ అవార్డులు పొందిన లైఫ్ ఆఫ్ పై చిత్రం భారత్ లోని పుదుచ్చేరి, మున్నార్ వంటి ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకున్న విశేషాలు వెల్లడించారు.

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరన్, ఉపాసనలతో పాటు విద్యాబాలన్

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిరంజీవి

పర్యాటక శాఖ మంత్రి హోదాలో చిరంజీవి కాన్స్ ఫిస్టివల్‌కు హాజరయ్యారు.

భారత్ లో అంతర్జాతీయ సినిమా షూటింగలకు అనువైన స్థలాలు, ప్రభుత్వ సహకారం ఎలా ఉంటుంది అనే వివరాలను వెల్లడిస్తున్న చిరంజీవి


Click it and Unblock the Notifications











