ఆయన మనుషుల్లో మాణిక్యం.. ఈయన మట్టిలో మాణిక్యం.. చిరంజీవి
Recommended Video

దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రూపొందించిన 'తెరవెనుక దాసరి' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నాడు సిని ప్రముఖులు, దాసరి శిష్యులు, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, మురళి మోహన్, ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు పలువురు రాసిన వ్యాసాల సంకలనంగా ఈ పుస్తకం రూపొందింది.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. పసుపులేటి రామారావు నాకు 40 సంవత్సరాలుగా తెలుసు. రామారావు మట్టిలో మాణిక్యం, దాసరి మనుషుల్లో మాణిక్యం అని అన్నారు. దాసరి గురించి ప్రస్తావిస్తూ దాసరి ఒక దాత, దర్శకుడు, ఒక చరిత్రకారుడు. దాసరి లాంటి వ్యక్తి ఇంకొకరు ఉండరు. ఉండలేరు. దాసరి వ్యక్తిత్వం గురించి వెల్లడిస్తూ, 40 సంవత్సరాల క్రితం పసుపులేటి రామారావు తన గురించి రాసిన ఒక ఆర్టికల్ గురించి చిరంజీవి గుర్తు చేశారు.


Click it and Unblock the Notifications











