మీరు చూపిన కరుణకు హృదయపూర్వక ధన్యవాదాలు: చిరంజీవి

కరోనా కల్లోలంతో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా ఉంటూ చిరంజీవి సారథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా నిరుపేదలైన సినీ కార్మికులకు అండగా నిలుస్తామని, ఈ కార్యక్రమానికి దాతలు సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ పిలుపు మేరకు టాలీవుడ్ నుంచి ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు స్పందించి తమ తమ విరాళాలు ప్రకటించారు. తాజాగా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ ట్వీట్ చేశారు చిరంజీవి. ఈ సందర్భంగా.. ఎవరెవరు ఎంతెంత విరాళాలు ప్రకటించారన్న వివరాలను చెబుతూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది.

నాని- రూ.30 లక్షలు, అల్లు అర్జున్- రూ. 20 లక్షలు, శ్రీమిత్రా చౌదరి- రూ.5 లక్షలు, సుశాంత్- రూ.2 లక్షలు, వెన్నెల కిషోర్- రూ.2 లక్షలు, సంపూర్ణేశ్ బాబు లక్ష రూపాయల విరాళం ప్రకటించినట్లు చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టాలీవుడ్ ప్రముఖులు కదలిరావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi Special thanks to Tollywood celebrities

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. వేలాది మరణాలు చోటుచేసుకుంటున్నాయి. జనం భయాందోళనకు గురవుతున్న ఈ పరిస్థితుల్లో పలువురు సినీ ప్రముఖులు కరోనా పట్ల జాగ్రత్తలు చెబుతూ అందరిలో ధైర్యం నింపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X