డియర్ కల్యాణ్ బాబు.. ఆ విషయంలో గర్వంగా ఉంది: పవన్‌పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరం నేడు జరుగుతున్న ఓట్ల లెక్కింపుతో దాదాపుగా చివరి దశకు చేరుకుంది. నెల రోజుల ఉత్కంఠకు తెర దించుతూ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి విజయం సాధించింది. ఇప్పటికే 110కి పైగా సీట్లలో విజయం సాధించి.. మరో 50కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో వెలువడిన ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. మరి ఆయన ఎలాంటి కామెంట్లు చేశారో మీరే చూసేయండి మరి!
మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ కూటమి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ X (ట్విట్టర్) ఖాతాలో పోస్టులు చేశారు. ముఖ్యంగా తన సోదరుడు పవన్ కల్యాణ్ విజయంపై ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్‌లో 'డియర్ కల్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించావు. నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్‌వు మాత్రమే కాదు.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌వు కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది' అన్నారు.
ఇదే ట్వీట్‌లో మెగాస్టార్ చిరంజీవి 'నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను' అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











