twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సైరా’ కోసం కాళ్ల మీద పడి అనుమతి తెచ్చారు: సినీ మహోత్సవంలో చిరంజీవి కామెంట్

    |

    Recommended Video

    Chiranjeevi Interesting Speech At Cinemahotsavam 2019

    తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.

    మెగాస్టార్ చిరంజీవితో పాటు కృష్ణంరాజు, కృష్ణ, మహేష్ బాబు, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత, రాజశేఖర్, కోటా శ్రీనివాస్, ఇంకా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, చిన్నజీవర్ స్వామి కూడా హాజరయ్యారు.

    సినిమా అనే సౌధానికి మేనేజర్లే పునాది రాళ్లు

    సినిమా అనే సౌధానికి మేనేజర్లే పునాది రాళ్లు

    ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... మేనేజర్స్ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్స్ వైభవంగా జరగడం ఆనందంగా ఉంది. సినిమా కోసం మేనేజర్స్ ఎంత కష్టపడతారో తెలుసు. సినిమా అనే అద్భుతమైన సౌధం అనుకుంటే మేనేజర్లు పునాదిరాళ్లు. షూటింగుకు అన్నీ సమకూర్చేందుకు వాళ్లు నిద్రాహారాలు మాని పని చేస్తారు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    మా మేనేజర్ వాళ్ల కాళ్ల మీద పడి అనుమతి తీసుకున్నారు

    మా మేనేజర్ వాళ్ల కాళ్ల మీద పడి అనుమతి తీసుకున్నారు

    నేను నటిస్తున్న ‘సైరా' మూవీ షూటింగ్ కోసం ఓ లొకేషన్ మాకు అవసరం అయింది. మా మేనేజర్ వారి కాళ్ళ మీద పడి అనుమతి తీసుకున్నారు, తెర వెనక వారు అంత కష్టపడతారు కాబట్టే సినిమా షూటింగ్స్ ఎలాంటి అవాంతరాలు లేకుండా జరుగుతాయి.... అని మెగాస్టార్ చెప్పుకొచ్చారు.

    రూ. 32 లక్షల విరాళం ఇచ్చిన దిల్ రాజు

    రూ. 32 లక్షల విరాళం ఇచ్చిన దిల్ రాజు

    ప్రొడక్షన్ మేనేజర్లు నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌కు రావడం ఆనందంగా ఉంది. నేను ఇప్పటి వరకు 32 సినిమాలు తీసాను కాబట్టి రూ. 32 లక్షలు మేనేజర్స్ యూనియన్‌కు విరాళంగా ఇస్తున్నాను. మేము చేసే ప్రతి సినిమాలో మేనేజర్ల సహాయ సహకారాలు ఉంటాయి, వారు లేకుంటే సినిమా ముందుకు సాగడం చాలా కష్టం అని దిల్ రాజు తెలిపారు.

    వారు తలుచుకుంటే సినిమా టైమ్ లోపల పూర్తవుతుంది

    వారు తలుచుకుంటే సినిమా టైమ్ లోపల పూర్తవుతుంది

    ప్రొడక్షన్ మేనేజర్స్ తలుచుకుంటే సినిమా అనుకున్న సమయంలో పూర్తవుతుంది. గత 50 ఏళ్ల నుండి ఎంతో మంచి మేనేజర్స్‌ను చూశాను. వారు బావుంటనే సినిమా షూటింగ్ బాగా జరుగుతుంది. వారు ఇలాంటి ఫంక్షన్లు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ప్రముఖ నటుడు కృష్ణం రాజు వ్యాఖ్యానించారు.

    English summary
    The Silver Jubilee function was held on the occasion of 25 years of the Telugu Cinema Industry Production Managers Union. Chiranjeevi, Mahesh Babu and Union Minister Kishan Reddy attended the ceremony in Hyderabad on Sunday night.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X