twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సజ్జనార్ చేతిలో ఆయుధం అంటే వామ్మో.. నవ్వుల పంట పండిచిన చిరంజీవి

    |

    కరోనాను జయించి పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన దాతలను సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కంట్రోల్ (ఎస్‌సీఎస్సీ) అధ్వర్యంలో సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ స్పూర్తిదాయక సందేశాన్ని అత్యంత ఆహ్లాదకరంగా, నవ్వులతో ముంచెత్తు ఇచ్చారు. దాతలకు స్ఫూర్తినిస్తూ ఆద్యంత చలాకీగా చిరంజీవి మాట్లాడారు. ఈ సందర్భంగా మెగాస్టార్ నవ్వుల పంటను పండించారు. చిరంజీవి మాట్లాడుతూ ..

     ప్లాస్మా దాతలకు సరైన సమాచారం.

    ప్లాస్మా దాతలకు సరైన సమాచారం.

    కరోనా పేషెంట్లకు ప్లాస్మా అవసరం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో ప్లాస్మా ఎక్కడ లభ్యమవుతుంది. ప్లాస్మా కోసం ఎవరిని సంప్రదించాలనే పరిస్థితుల్లో సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కంట్రోల్ (SCSC), సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా donateplasma.scsc.in అనే వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్లాస్మా అవసరమైన వాళ్లు, ప్లాస్మాదాతలు కూడా తమ పేర్లను నమోదు చేసుకొనే విధంగా వెసలుబాటును కల్పించారు.

     సైబరాబాద్ పోలీసుల అధ్వర్యంలో

    సైబరాబాద్ పోలీసుల అధ్వర్యంలో

    సోసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కంట్రోల్ ఏర్పాటు చేసిన donateplasma.scsc.in వెబ్‌సైట్‌కు మంచి ఆదరణ లభిస్తున్నది. దాతలు, గ్రహీతల నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఈ క్రమంలో దాతలను చిరంజీవి చేతుల మీదుగా సన్మానించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ప్లాస్మా దాతలను కొనియాడారు.

    సీపీ సజ్జనార్‌ కోరితే నేను..

    సీపీ సజ్జనార్‌ కోరితే నేను..

    ప్లాస్మా దాతలకు స్ఫూర్తినిచ్చేలా ఓ సందేశం ఇవ్వాలని సీపీ సజ్జనార్ నన్ను కోరారు. ఇలాంటి కార్యక్రమంలో మాట్లాడి దాతలకు స్పూర్తినిచ్చేలా.. అలాగే నా మాటల విని ఆచరించేలా చేసేందుకు ఆయనతో ఈ వేదికను పంచుకోవడం ఆనందంగా ఉంది. తెల్ల రక్తకణాల్లో ప్లాస్మా కణాలు ఉంటాయి. వాటిని రోగికి ఇస్తే వారిలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని అని చిరంజీవి తెలిపారు.

    నా ఇంటిలో నలుగురికి కరోనా

    నా ఇంటిలో నలుగురికి కరోనా

    తన ఇంటిలో నలుగురికి కరోనా సోకిన విషయాన్ని హాస్యభరితంగా చెప్పుతూనే జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి కష్టాలు అనుభవిస్తారనే విషయాన్ని చిరంజీవి వెల్లడించారు. తన ఇంటిలో పనిచేసే పని మనుషులు కూడా కరోనా బారిన పడ్డారు. వారిని క్వారంటైన్‌లో పెట్టి చికిత్స అందించాం. ఇప్పుడు వారంతా కోలుకొన్నారు అని చిరంజీవి పేర్కొన్నారు.

     ప్లాస్మా డొనేషన్ ప్రొగ్రాంను యజ్ఞంలా

    ప్లాస్మా డొనేషన్ ప్రొగ్రాంను యజ్ఞంలా

    ఇక ప్లాస్మా డోనేషన్ కార్యక్రమాన్ని సజ్జనార్ గారు ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. అందుకు మనమంతా ఆయనను కరతాళ ధ్వనులతో అభినందించాలి అని చిరంజీవి అన్నారు. ఆయనతో నాకు పరిచయం ఎక్కువ లేదు. నా గురించి ఆయనకు.. ఆయన గురించి నాకు చాలా తెలుసు. ఆయన నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం నిజంగా ఆనందంగా ఉంది అన్నారు.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
    సజ్జనార్ నన్ను ఆయుధంలా అంటూ

    సజ్జనార్ నన్ను ఆయుధంలా అంటూ

    సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఇంక ముందు ఏ కార్యక్రమం ప్రారంభించిన నన్ను పిలుస్తే తప్పకుండా హాజరవుతాను. పది మందికి ఉపయోగపడే ఎలాంటి కార్యక్రమాలకు నన్ను ఓ వెపన్ (ఆయుధం)లా ఉపయోగించుకోవాలి. ఆయన చేతిలో వెపన్ అంటే కొంచెం అని చిరంజీవి అనగానే నవ్వులతో మునిగిపోయారు. తమ ప్రచార కార్యక్రమాలకు నన్ను సాధనంగా ఉయోగించుకొన్నందుకు మీకు రుణపడి ఉంటాను అని సజ్జనార్‌తో చిరంజీవి అన్నారు. ప్రస్తుతం చిరంజీవి స్పీచ్ ఇంటర్నెట్ మాధ్యమాల్లో, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.

    English summary
    Nega star Chiranjeevi participated in Cyberabad commissioner of Police Sajjanar's SCSC Plasam donation program. In this occassion, Chiranjeevi gives inpspirational spech along with Sajjanar. and he generates humour along with in his speech.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X