ఏందిరా ఏం మాట్లాడుతున్నావ్...డాష్ డాష్ డాష్: చిరంజీవి సెన్సేషనల్ స్పీచ్

By Bojja Kumar

Recommended Video

Chiranjeevi Speech @GeethaGovindam Success Meet

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మికా మంద‌న్నా జంట‌గా పరశురాం దర్శకత్వంలో న‌టించిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హైదరాబాద్‌లో స‌క్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌రై తనదైన ప్రసంగంతో ఆకట్టుకున్నారు. సైరా షూటింగులో తీరిక లేకుండా గడుపుతున్న ఆయన ఒక రోజు షూటింగ్ ఆపుకుని మరీ ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తన సెన్సేషనల్ స్పీచ్‌తో అభిమానులతో విజిల్స్ వేయించారు.

ఈ ఫంక్షన్ మాదా? విజయ్ దేవరకొండదా

ఈ ఫంక్షన్ మాదా? విజయ్ దేవరకొండదా

చిరంజీవి మాట్లాడుతూ ``చాలా ఫంక్ష‌న్ల‌కు ఈ మ‌ధ్య వెళ్లాను. అయితే ఇక్కడ వైబ్రేష‌న్స్ చూస్తుంటే ఇది మాదా? విజ‌య్ దేవ‌ర‌కొండ‌దా? అనేది అర్థం కాలేదు. ఎనర్జిటిక్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమా స‌క్సెస్ మీట్లో మీ అంద‌రినీ క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది. పెద్దలకు, నిర్మాతల, ఇతర ఆహ్వానితులకు, మా మెగా అభిమానులు, ఈ రౌడీ అభిమానులకు పేరు పేరున హృదయ పూర్వక నమస్కారాలు. సినిమా ఇంత సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది అన్నారు.

వందల మందితో సైరా షూటింగ్

వందల మందితో సైరా షూటింగ్

సైరా షూటింగులో బిజీగా ఉన్నాను. వందల మందితో షూట్ జరుగుతోంది. నిజానికి ఈ రోజు షూటింగ్ ఉంది. నిన్న రాత్రి కూడా 2 గంట‌ల వ‌ర‌కు చేశాం. కానీ బన్నీ వాస్, అల్లు అరవింద్, దర్శకుడు నేను రావాలని కోరడంతో కాదనలేక పోయాను. `షూటింగ్ ఒక‌రోజు ఆగినంత మాత్రాన ఏమీ జ‌రగ‌దు. వ‌ర్షం ప‌డుతున్న‌ప్పుడు కూడా ఆపేస్తుంటాం కదా అనిపించింది. ఇలాంటి వేడుక‌లో పాల్గొన‌డం వ‌ల్ల నాకు ఆనందంగా ఉంటుంది. ఇంత ఆనందం మాకు ప్రేక్ష‌కులే ఇచ్చారు. వాళ్ల ఆశీస్సుల‌తో మాత్ర‌మే మాకు ఈ ఆనందం ద‌క్కిందని చిరంజీవి అన్నారు.

గ‌త రెండేళ్లుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ చాలా సంతోషంగా

గ‌త రెండేళ్లుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ చాలా సంతోషంగా

సినిమా బావుందంటే చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా మీరు ఆదరిస్తారు. ఈ మ‌ధ్య గ‌త రెండేళ్లుగా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంది. బ‌డ్జెట్ ఎంతైనా సినిమాలు చాలా పెద్ద స‌క్సెస్ సాధిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ఆనందంగా ఉంది. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ వల్లే ఇదంతా సాధ్యమైంది అన్నారు.

ఆ సమయంలో మేమూ అనుమానపడ్డాం

ఆ సమయంలో మేమూ అనుమానపడ్డాం

ఈ మ‌ధ్య అల్లు అర‌వింద్‌గారు క‌లిసిన‌ప్పుడు ఏ సినిమా చేస్తున్నార‌ని అడిగితే `విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప‌రశురామ్‌తో ఓ సినిమా చేస్తున్నాం. అతడి గత సినిమా అర్జున్ రెడ్డితో పోలిస్తే ఈ సినిమాలో అతడు చేసిన క్యారెక్టర్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని టెన్ష‌న్ ఉంది` అని అన్నారు. ఆ స‌మ‌యంలో నాకు ఇదే గీతా ఆర్ట్స్ లో చేసిన `విజేత‌` గుర్తుకొచ్చింది. ఆ సమ‌యంలో నేను అటు `ఖైదీ`, `అడ‌వి దొంగ‌`, `చ‌ట్టంతో పోరాటం`, `చ‌ట్టానికి క‌ళ్లులేవు` లాంటి యాక్ష‌న్ సినిమాల్లో హీరోగా నేను దూసుకుపోతున్నాను. అప్పుడు `విజేత‌`లో చాలా సాఫ్ట్ క్యారెక్టర్. అప్పుడు ఆ సినిమాను ఎలా యాక్సెప్ట్ చేస్తారో అనుకున్నాం. కానీ ఆ సినిమా న‌న్ను ఆల్ క్లాస్ హీరోగా నిల‌బెట్టింది. విజయ్‌కి ‘గీత గోవిందం' కూడా ఫ్యామిలీ హీరో ఇమేజ్ తెచ్చింది.

 దర్శక, నిర్మాతల గురించి

దర్శక, నిర్మాతల గురించి

దర్శకుడు ప‌ర‌శురామ్‌ రెండున్న‌ర గంట‌ల పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కథను నడిపించి క‌థ‌కుడిగా, స్క్రీన్ ప్లే రైట‌ర్‌గా, డైర‌క్ట‌ర్‌గా విజయం సాధించాడు. బ‌న్నీ వాసు అల్లు అర్జున్‌కి ఫ్రెండ్‌గా ఈ సంస్థ‌లోకి వచ్చాడు. అతడు కథలు బాగా జ‌డ్జి చేస్తాడని అనగా విన్నాను. కథల మీద నమ్మకం ఉన్నపుడే ఏ నిర్మాత అయినా విజయం సాధించగలడు. ఈ రోజున నిర్మాత స్థాయికి రావడం ఆనందంగా ఉంది. బన్నీ వాస్ లాంటి వారిని ఎంకరేజ్ చేస్తున్న అల్లు అరవింద్ ను అభినందిస్తున్నాను.

 ఏందిరా ఏం మాట్లాడుతున్నావ్...డాష్ డాష్ డాష్

ఏందిరా ఏం మాట్లాడుతున్నావ్...డాష్ డాష్ డాష్

అర్జున్ రెడ్డిలో ‘ఏందిరా ఏం మాట్లాడుతున్నావ్...డాష్ డాష్ డాష్' ఆ మాట నేను అనలేను. ఈ సినిమాలో మేడమ్ మేడమ్ నీ కాళ్లు పట్టుకుంటా మేడమ్ అంటూ విజయ్ చాలా వైవిద్యం చూపించి శభాష్ అనిపించాడు. ఆ అర్జన్ రెడ్డి.... ఈ గోవిందం ఒకరేనా అనిపించేంతగా చేశాడు అని చిరంజీవి అన్నారు.

అర్జున్ రెడ్డి అందరినీ ఆకట్టుకోలేదు

అర్జున్ రెడ్డి అందరినీ ఆకట్టుకోలేదు

అంతకు ముందు అతడు చేసిన పెళ్లి చూపులులో సాప్ట్ క్యారెక్టర్లో చూశారు. అర్జున్ రెడ్డిలో చాలా ఎగ్రసివ్ గా బావుంది. ఇది యాక్సిడెంట్‌గా హిట్ అయిందా? యూత్ కి కనెక్ట్ కావడం వల్ల హిట్టయిందా? అనిపించింది. కానీ అది అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకోలేద‌న్న‌ది సత్యం. అలాంటి విజయ్ ఇందులో పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. గోవిందం క్యారెక్టర్లో నిద్ర‌పోతున్న అమ్మాయితో సెల్పీ తీసుకుంటూ ప్రమాద వశాత్తు లిప్‌లాక్ చేసి ఇబ్బందుల్లో పడే పాత్రలో చాలా బాగా చేశాడు. సినిమాలో సాఫ్ట్‌గా, కోపంగా ఉండే సీన్లలో చాలా బాగా చేశాడు. విజయ్ కు చాలా భవిష్యత్ ఉంది.

విజయ్ స్టార్ హీరో అయ్యాడు

విజయ్ స్టార్ హీరో అయ్యాడు

ఈ సినిమాతో విజ‌య్‌కి స్టార్ స్టేట‌స్ వ‌చ్చింది. నాక్కూడా 1978 నుంచి 30 సినిమాలు దాకా చేసినా స‌రే `ఖైదీ` నాకు స్టార్ స్టేట‌స్ ఇచ్చింది. ఈ సినిమా విజయ్‌కు స్టార్ హోదా ఇచ్చింది. ఇండ‌స్ట్రీలో ఉన్న టాప్ స్టార్ల‌లో విజ‌య్ ఒక‌డు. అత‌న్ని నేను వెల్క‌మ్ చేస్తున్నా. ఇండ‌స్ట్రీకి దొరికిన అరుదైన, వెర్సటైల్ స్టార్ విజ‌య్‌. ప్ర‌తి అడుగునూ ఆచితూచి వేసుకోవాలని సూచిస్తున్నాను... అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

వారి అభిమానాన్ని త‌ల‌పై కాకుండా

ఆడియ‌న్స్ ఉత్సాహం మ‌న‌కు ఎన‌ర్జీని ఇస్తుంది. దాన్ని కావాల‌ని విజ‌య్ కోరుకుంటున్నాడు. వారి అభిమానాన్ని త‌ల‌పై కాకుండా, గుండెల్లో పెట్టుకుంటే వారు కూడా గుండెల్లో పెట్టుకుంటారు... అని చిరంజీవి అన్నారు.

రష్మిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ గురించి

రష్మిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ గురించి

వెన్నెల‌కిశోర్ చివ‌ర్లో వ‌చ్చినా చ‌మ్మ‌క్ అనిపించాడు. తింగ‌రిత‌న‌మైన యాక్టింగుతో మెప్పించాడు. రాహుల్ రామ‌కృష్ణ కూడా చాలా స‌ర‌దాగా చేశాడు. సినిమా చివ‌రి వ‌ర‌కు ర‌క్తి క‌ట్టించ‌డానికి వీళ్ల కేర‌క్ట‌ర్లు కూడా దోహ‌ద‌ప‌డ్డాయి. సుబ్బ‌రాజు నాకు చాలా నచ్చిన యాక్టర్. అన్న‌పూర్ణ‌మ్మ నాకు తల్లి. చాలా ఏళ్లు అయింది ఆవిడ‌ను చూసి. మా కాంబినేష‌న్ స‌క్సెస్ అయింది. ఈ సినిమాలో ఆమె విజృంభించారు. ర‌ష్మిక బ్యాంకాక్‌లో ఉండటం వల్ల రాలేదు. చాలా చ‌క్క‌గా న‌టించింది. హీరో గ‌నుక నిల‌బ‌డ‌క‌పోతే డామినేట్ చేసే కేర‌క్ట‌ర్‌. అలాంటిది ఆ అమ్మాయి చాలా కంపోజ్డ్ గా క‌ళ్ల‌తోనే కోపం చూపించి వావ్ అనేలా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X