ఇది అన్యాయం.. మీరంతా కలిసి ఎమోషనల్‌కి గురిచేశారు: చిరంజీవి

రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూకుడును ప్రదర్శిస్తున్నారు. వరుసగా సినిమాలు ఒప్పుకోవడమే కాకుండా.. చిన్న చిన్న సినిమాలను సైతం ప్రోత్సహించేందుకు ఆయా ఈవెంట్లకు వెళ్తున్నారు. అలాగే, పెద్ద స్టార్ల మూవీల కోసమూ తరలి వెళ్తున్నారు. అంతేకాదు, పరిశ్రమలో ఏది జరిగినా ముందుంటున్నారు. దీంతో ఎక్కడ చూసిన మెగాస్టారే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ పిట్ట కథ ఈవెంట్లో చిరంజీవి ఎంతో ఆసక్తికరంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. వివరాల్లోకి పోతే..

‘ఓ.. పిట్ట కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. చిరంజీవి సందడి

‘ఓ.. పిట్ట కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్.. చిరంజీవి సందడి

టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఓ.. పిట్ట కథ'. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కించారు. విశ్వంత్‌, నిత్య, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 6న ప్రేక్షకుల ఈ మూవీ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం (మార్చి 1) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరై సందడి చేశారు.

 చిన్నదా? పెద్దదా? అని చూడను.. ఆ సంతృప్తి కలిగింది

చిన్నదా? పెద్దదా? అని చూడను.. ఆ సంతృప్తి కలిగింది

ఈ సందర్బంగా వేదికపై తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన చిరంజీవి.. ఇది 'ఓ పిట్ట కథ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదని, తన సమాన సభ అని అనిపిస్తోందని చెప్పారు. ''ఇది అన్యాయం మీరంతా కలిసి నన్ను పిలిచి ఇలా నా గురించి కొత్తగా మాట్లాడి చాలా ఎమోషనల్ కి గురి చేశారు. చాలా థాంక్స్. ఏదైనా ఫంక్షన్ వెళ్తే అది చిన్నదా? పెద్దదా? అని చూడను. అక్కడికెళ్ళాక ఆ స్పందన చేస్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది. అలాంటి సంతృప్తి ఈ ఫంక్షన్ లో కలిగింది'' అని చిరంజీవి అన్నారు.

 బ్రహ్మాజీ వచ్చి అడిగాడు.. చాలా సంతోషంగా ఉంది

బ్రహ్మాజీ వచ్చి అడిగాడు.. చాలా సంతోషంగా ఉంది

నిన్న మొన్నటిదాకా నా సినిమాలతో బిజీగా ఉన్నాను. బ్రహ్మాజీ వచ్చి మా అబ్బాయి సినిమా విడుదల కాబోతోంది. దాని కోసం ఓ ఫంక్షన్ చేయబోతున్నాం. దానికి హైప్ రావాలంటే మీరు పార్టిసిపేట్ చేయాలని కోరారు. ఇలాంటి వేదిక మీదకొచ్చి కొత్త నటీనటులకు ఆశీస్సులు ఇవ్వడంలో ఉండే సంతృప్తి అంతా ఇంతా కాదు. అందుకే వెంటనే ఓకే చెప్పా. ఇక ఇక్కడకొచ్చాక మీరిస్తున్న రెస్పాన్స్ చూసి చాలా సంతోషంగా ఉందని చిరంజీవి చెప్పారు.

 కొత్త తరం నటులకు ఇది అవసరం

కొత్త తరం నటులకు ఇది అవసరం


ఈ మధ్య చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. దయచేసి చిన్న సినిమాలనూ ఆదరించాలని పంపిణీదారులను కోరుతున్నా అంటూ వేదికపై చిరంజీవి చెప్పి తనలోని గొప్పతనాన్ని చాటుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో సానుకూల దృక్పథం చాలా అవసరం. కష్టాల్లో ఉన్నప్పుడు దృఢంగా ఉన్నవాళ్లే ఇక్కడ నిలదొక్కుకోగలుగుతారు. కొత్త తరం నటులకు ఇది చాలా అవసరం అని నటీనటులకు గైడెన్స్ ఇచ్చారు మెగాస్టార్.

సంజయ్ గురించి విన్నా.. నేను కూడా అలాగే వదులుకున్నా..

సంజయ్ గురించి విన్నా.. నేను కూడా అలాగే వదులుకున్నా..

''ఇక ఓ పిట్ట కథ సినిమా హీరో సంజయ్‌, నేవీ ఉద్యోగం వదులుకొని సినిమాల్లోకి వచ్చాడని విన్నాను. నేను కూడా నేవీని వదులుకొని వచ్చిన వాడినే. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్‌ ఉన్న వాళ్లకు మంచి భవిష్యత్‌ ఉంటుంది'' అన్నారు చిరంజీవి.

Recommended Video

Chiranjeevi And Balakrishna Together At Kodi Ramakrishna Daughter's Marriage | Filmibeat Telugu
ముంబై నుంచి వచ్చిన హీరోయిన్‌ అనుకున్నా.. కానీ!

ముంబై నుంచి వచ్చిన హీరోయిన్‌ అనుకున్నా.. కానీ!

''నిత్యా శెట్టి గురించి చెప్పాలంటే.. ఆమె 'అంజి' సినిమాలో చేసిన బాలనటి అని నాకు ఇప్పుడే తెలిసింది. ఆమె పేరు విని ఎవరో ముంబై నుంచి వచ్చిన హీరోయిన్‌ అనుకున్నా. కానీ.. అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపిస్తోంది. చూస్తుంటే యాంకర్‌ సుమకు పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ సినిమా బ్రహ్మాజీ, సంజయ్‌తో పాటు నిర్మాత ఇతర నటీనటులందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X