నేను రానన్నా.. కానీ న‌న్ను మోసం చేసి.. లాక్ చేసేసాడు.. చిరంజీవి

By Rajababu

Recommended Video

Chiranjeevi Speech @ Santhosham Film Awards

16వ సంతోషం సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఆదివారం సాయంత్రం హైద‌రాబాద్ జెఆర్.సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో ఆట పాట‌ల‌తో..తార‌ల త‌ళుకుబెళుకుల నడుమ అంగ‌రంగ వైభవంగా ఎంతో ఘ‌నంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జాన‌కి ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఇంకా ప‌లువురు టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు...రాజ‌కీయ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల న‌టీన‌టుల‌కు అవార్డులు అందిచ‌డం జ‌రిగింది.

ఎస్ జానకి చేతుల మీదుగా

ఎస్ జానకి చేతుల మీదుగా

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, `నాకు అవార్డు ఇస్తానంటే వేడుక‌కు రాను. ఇవ్వ‌నంటేనే వ‌స్తాన‌ని సురేష్‌కి ముందే చెప్పాను. కానీ న‌న్ను మోసం చేసి గాన గోకిల ఎస్. జాన‌కి గారు చేతుల మీదుగా అవార్డు బ‌హుక‌రించి న‌న్ను లాక్ చేసేసాడు. కాద‌న‌లేక ఈ అవార్డు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగాను ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె చేతుల మీదుగా ఎప్పుడూ అవార్డు తీసుకోలేదు. సింగ‌పూర్ లో ఏదో వార్డుల కార్య‌క్ర‌మంలోనే ఇద్ద‌రం క‌లిసాం. మ‌ళ్లీ సంతోషం వేడుక‌ల్లోనే క‌లిసాం అని అన్నారు.

అవార్డు తీసుకొన్నందుకు గర్వంగా

అవార్డు తీసుకొన్నందుకు గర్వంగా

తొలిసారి ఎస్ జానకి చేతుల మీద‌గా సంతోషం అవార్డు తీసుకుంటున్నందుకు చాలా గ‌ర్వంగా ఉంది. ఈ సంద‌ర్భంగా సురేష్‌కు ధ‌న్య‌వాధాలు తెలుపుతున్నా. మ‌రొక‌రు చేతులు మీదుగా ఇచ్చుంటే తిర‌స్క‌రించేవాడిని. ఎందుకంటే ఇలాంటి అవార్డులు కొత్త వారికి ఇచ్చి ప్రోత్స‌హిస్తే బాగుంటుంది. వాళ్ల‌లో ఉత్సాహం నింపిన‌ట్లు ఉంటుంది. వాళ్ల‌ను చూసి మ‌రెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. కొత్త‌త‌రం న‌టీన‌టులు, సాంకేతికి నిపుణులు ప‌రిశ్ర‌మ‌కు ఎంతైనా అవ‌స‌రం.

సంకల్ప్‌పై మెగాస్టార్ ప్రశంసలు

సంకల్ప్‌పై మెగాస్టార్ ప్రశంసలు

సంక‌ల్ప్ ను ఓసారి మీలో కోటీశ్వరుడు షోలో దగ్గుబాటి రానా ప‌రిచయం చేశాడు. అత‌ను మాట‌ల మ‌నిషికాదు..చేత‌ల మ‌నిషి. త‌న ప‌నిత‌నాన్ని `ఘాజీ` సినిమాతో చాటి చెప్పాడు. ఆ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌డు మా వ‌రుణ్ తేజ్ తో స్పేస్ బ్యాక్ డ్రాప్ లో `అంత‌రిక్షం` సినిమా చేస్తున్నాడు. కొన్ని విజువ‌ల్స్ చూసాను. చాలా బాగున్నాయి. ఘాజీ క‌న్నా ఆ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా.

 రామ్, లక్ష్మణ్‌ లిద్దరూ గ్రేట్

రామ్, లక్ష్మణ్‌ లిద్దరూ గ్రేట్

రామ్ -ల‌క్ష్మ‌ణ్ ఎక్క‌డో వేట‌పాలెం నుంచి మ‌ద్రాస్ వ‌చ్చి ఫైట్ మాస్ట‌ర్లు అయ్యారు. అప్ప‌ట్లో నాకు రాజు అనే స్టంట్ మాస్ట‌ర్ ఎక్కువ‌గా ఫైట్లు కంపోజ్ చేసేవారు. ఆయన వ‌ద్ద స‌హాయ‌కులుగా చేరి..గొడుగు ప‌ట్టిన వాళ్లు ఈరోజు ఇంత మంచి స్థానానికి రావ‌డం చాలా సంతోషంగా ఉంది అని చిరంజీవి అన్నారు.

అందుకే గొప్పవాళ్లయ్యారు

అందుకే గొప్పవాళ్లయ్యారు

టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోలంతా రామ్ ల‌క్ష్మ‌ణ్ డేట్లు అడుగుతున్నారు. లేదంటే వాయిదా వేసుకుంటున్నారంటే వాళ్లు ఎంత గొప్ప వాళ్లు అయ్యారో అర్ధం చేసుకోవ‌చ్చు. వీళ్లు ఇప్పుడు చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నార‌ని` చిరంజీవి ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X