వీడియో : దిల్ రాజు,పవన్ గురించి చిరంజీవి ఇలా ...(ఫుల్ స్పీచ్)

By Srikanya

హైదరాబాద్ : దిల్‌రాజు అన్ని శాఖలపై పట్టున్న నిర్మాత. 'మీతో ఓ సినిమా తీయాలని ఉంది, అవకాశమిస్తారా' అని నన్ను ముందు అడిగాడు కానీ నిజానికి నేనే ఆయన్ని 'నాతో ఓ సినిమా చేయండి అని అడుగుదామనుకొన్నా'. 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' కథ వింటుంటే నేను నటించిన 'మొగుడు కావాలి', 'బావగారూ బాగున్నారా' గుర్తుకొచ్చాయి. రెజీనా బాగా నటించింది. అభిమానులు ఎప్పుడూ మాపై ప్రేమని కురిపిస్తూనే ఉన్నారు. వాళ్లకు మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది''అన్నారు చిరంజీవి.

''ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించే కథని తీసుకురండి. అలాంటి కథతో వచ్చినవాళ్లు ఎవరైనా నా సినిమాకి దర్శకుడు కావొచ్చు'' అన్నారు ప్రముఖ హీరో చిరంజీవి. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' పాటల విడుదల వేడుకకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పాటల్ని ఆవిష్కరించారు. సాయిధరమ్‌ తేజ్‌, రెజీనా జంటగా నటించిన చిత్రమిది. హరీష్‌శంకర్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు.

Chiranjeevi Speech At Subramanyam For Sale Audio Launch

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిరంజీవి మాట్లాడుతూ ''అభిమానుల మధ్యకి వచ్చినప్పుడు మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంటుంది. ఇలాంటి అవకాశం ఎప్పుడొచ్చినా వదులుకోను. ఎనిమిదేళ్లుగా నేను నటించడం లేదేమో కానీ సినిమాకి ఎప్పుడూ దగ్గరగానే ఉన్నా. మా ఇంట్లో కథానాయకుల చిత్రాలకి సంబంధించిన కథల్ని వింటూ వాళ్ల చిత్రాల్ని చూస్తూ సినిమాతో మమేకం అవుతున్నా. 150వ సినిమా చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నా. ఎవ్వరు మంచి కథతో వస్తారో అని ఎదురు చూస్తున్నా. 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌' వేడుకలో మరోసారి నా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉంది.

దర్శకుడు హరీష్‌శంకర్‌ తీసిన 'గబ్బర్‌సింగ్‌'కి నేను పెద్ద అభిమానిని. అందులో నటించిన పవన్‌కల్యాణ్‌ ఎంత నా తమ్ముడైనా నాలోనూ ఓ నటుడు ఉంటాడు కదా అందుకే ఇలాంటి సినిమా కదా నాకు కావాల్సింది, ఇలాంటి దర్శకుడు కదా నాక్కావాల్సింది అనిపించింది. అప్పట్లో 'గబ్బర్‌సింగ్‌' నెంబర్‌ వన్‌ సినిమాగా నిలిచిపోయింది అని చెప్పుకొచ్చారు.

మొత్తం స్పీచ్ ఇక్కడ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X