twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండియాలో మెగాస్టార్ ఒక్కరే... ‘సైరా’ ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన కథ: చిరంజీవి

    |

    మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తూ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. అక్టోబర్ 2న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా మంగళవారం(ఆగస్టు 20) ముంబైలో టీజర్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియా చిత్ర బృందం నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టింది.

    15 ఏళ్ల క్రితమే కథ సిద్ధమైంది, కానీ చేసే ధైర్యం చేయలేదు

    15 ఏళ్ల క్రితమే కథ సిద్ధమైంది, కానీ చేసే ధైర్యం చేయలేదు

    సైరా నరసింహారెడ్డి కథ ఎవరికీ తెలియని ఒక వీరుడి కథ. ఆ కథను ఇండియా మొత్తం తెలియాలనే ఈ సినిమా చేశాం. 15 సంవత్సరాల క్రితమే చేయాలనుకున్నాం. అయితే దానికి భారీ బడ్జెట్ అవసరం ఉండటంతో అపుడు చేసే ధైర్యం చేయలేదు. ఇపుడు చరణ్, సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్‌లో తీసి నా కలను నిజం చేశారని చిరంజీవి తెలిపారు.

    చరిత్రలో కనుమరుగైన నరిసింహారెడ్డి కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

    చరిత్రలో కనుమరుగైన నరిసింహారెడ్డి కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి

    చరిత్రలో కనుమరుగైన నరిసింహారెడ్డి కథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు. ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న కథ కావడంతో ఈ సినిమాను బాలీవుడ్లో కూడా చేయాలనుకున్నాం.

    అందుకే హిందీలోకి రావడానికి ఇంత గ్యాప్ వచ్చింది

    అందుకే హిందీలోకి రావడానికి ఇంత గ్యాప్ వచ్చింది

    1992లో ‘ఆజ్ కా గుండా రాజ్' తర్వాత మీరు మళ్లీ హిందీలో కనిపించలేదు. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ... ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. బాలీవుడ్లోకి రావడానికి సరైన కంటెంట్ దొరక్క పోవడమే ఓ కారణం కావొచ్చు. చాలా రోజుల క్రితమే నేను నటన ఆపేసి రాజకీయాల్లోకి వెళ్లాను. పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాను. మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత బాలీవుడ్లోకి రావడానికి ‘సైరా నరసింహారెడ్డి' ఒక మంచి ఆప్షన్ అనిపించింది.

    ఇండియాలో మెగాస్టార్ ఒక్కరే

    ఇండియాలో మెగాస్టార్ ఒక్కరే

    ఇద్దరు మెగాస్టార్లు తొలిసారి కలిసి నటిస్తున్నారు, మీ ఫీలింగ్ ఏమిటి? అనే ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ... అమితాబ్ బచ్చన్ సర్ నా రియల్ లైఫ్ మెంటర్. సినిమాలో కూడా ఆయన అలాంటి పాత్రే పోషించారు. ఇండియాలో ఒకే ఒక మెగాస్టార్ ఉన్నాడని నేను ఫీలవుతున్నాను. ఆయనే అమితాబ్ బచ్చన్.... ఆయన దరిదాపుల్లోకి కూడా ఎవరూ చేరుకోలేరు. ఆయనతో కలిసి పని చేయడం అద్భుతమైన అనుభూతి.

    నేను అడిగిన వెంటనే ఒప్పకున్నారు

    నేను అడిగిన వెంటనే ఒప్పకున్నారు

    ఈ సినిమాలో అమితాబ్ జీ నా గురువు పాత్ర పోషిస్తే బావుంటుందని దర్శకుడు భావించారు. అది స్పెషల్ క్యారెక్టర్. దానికి ఆయనైతేనే పర్ఫెక్టుగా సరిపోతారు అనిపించింది. అడిగి చూద్దామని ఒకసారి ఫోన్ చేశాను. మీరు ఈ సినిమాలో నటించాలి, రామ్ చరణ్ నిర్మిస్తున్నారు, అద్భుతమైన సబ్జెక్ట్, నా గురువు పాత్రలో నటించాలి, ఒక వారం రోజులు సమయం మాకు కేటాయిస్తే చాలు అని అడిగాం. ఆయన వెంటనే చేస్తాను అని చెప్పారు. అమితాబ్బ జీ ఒప్పుకోవడం ఎంతో గొప్పగా అనిపించింది. ఇండియన్ మెగాస్టార్ మా సినిమాలో భాగం కావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు.

    నేను మళ్లీ సినిమాల్లోకి వచ్చే సమయానికి అంతా మారిపోయింది

    నేను మళ్లీ సినిమాల్లోకి వచ్చే సమయానికి అంతా మారిపోయింది

    ఎర్లీ 90స్ నుంచి 2007 వరకు నేను ఫిల్మ్ ఫీల్డులో ఉన్నాను. ఆ తర్వాత యాక్టింగ్ ఆపేసి మళ్లీ 2016లో ఇండస్ట్రీలోకి ఎంటరైనపుడు అంతా మారిపోయింది. పూర్తిగా కొత్త టెక్నీలజీ వాడుతున్నారు. థియేటర్లలో కూడా ప్రోజెక్టర్లు పోయి డిజిటల్ వచ్చేసింది. అయితే కంటెంట్ మాత్రం మారలేదు. ఒక సినిమా విజయం సాధించడానికి అప్పుడు ఏ అంశాలు ఉన్నాయో ఇపుడు కూడా అవే అంశాలు ఉన్నాయని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    English summary
    Chiranjeevi speech at Sye Raa Narasimha Reddy teaser release event. Sye Raa Narasimha Reddy based on the life of a freedom fighter from Rayalaseema, Uyyalawada Narasimha Reddy. He was an unsung hero from Kurnool who revolted against the British in 1846.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X