Chiranjeevi నన్ను, నా కెరీర్‌ను సరిదిద్దింది మీరే.. జర్నలిస్టులపై మెగాస్టార్ ప్రశంసల వర్షం
టాలీవుడ్‌లో తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ (TFJA) తమ సభ్యులకు హెల్త్ కార్డులు, అసోసియేషన్ మెంబర్ షిప్ కార్డులను అందించేందుకు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా, మంత్రి శ్రీనివాస్ యాదవ్, యువ డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ జర్నలిస్టులపై ప్రశంసలు కురిపించారు. చిరంజీవి చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే
జర్నలిస్టుల కార్యక్రమానికి రావడం కుటుంబ సభ్యులను కలిసినట్టు అనిపిస్తున్నది. మీతో కలిసినప్పుడు బంధువులు, శ్రేయాభిలాషులు, కుటుంబ సభ్యులతో ఉన్నట్టు అనిపిస్తుంది. జర్నలిస్టులంటే నాకు ఎప్పుడు గౌరవం. నా కెరీర్ ఆరంభం నుంచి జర్నలిస్టులు నాకు ప్రోత్సాహం అందిస్తున్నారు. ప్రాణం ఖరీదు సినిమా సమయంలో నా గురించి పేపర్లలో ఏదైనా రాస్తే బాగుంటుందనే ఫీలింగ్ ఉండేది. ఆ సమయంలో ఒక జర్నలిస్టు నా గురించి రాశారు. అప్పుడు నేను చాలా ఆనందపడిపోయాను. ఉద్వేగానికి లోనయ్యాను. థ్యాంక్స్ చెప్పాలని భావించాను. ఉత్త థ్యాంక్స్ చెప్పకుండా ఏదైనా కొంత డబ్బు ఇద్దామని అనుకొన్నాను.

నాకు ఉన్న డబ్బులో 100, 200 ఇవ్వడానికి ప్రయత్నిస్తే. వెంటనే చేయి వెనక్కి తీసుకొన్నారు. డబ్బు కోసం రాయలేదు. మీలాంటి ప్రతిభావంతులకు ప్రోత్సాహం అందించడం నా ధర్మం, భాధ్యత అని చెప్పారు. ఆ సమయంలో టీ నగర్‌లో ఆంధ్రా క్లబ్ వద్ద జరిగిన సంఘటనలో ఉన్న జర్నలిస్టు పసుపులేటి రామారావు. ఆ రోజు నుంచి ఆయన స్వర్గస్తులయ్యేంత వరకు నా బంధం చాలా స్ట్రాంగ్ అవుతూ వచ్చింది. ఆయన ఏర్పరిచి అభిప్రాయం జర్నలిస్టులపై గౌరవం, సదభిప్రాయం కలిగించేలా చేసింది. డబ్బు తీసుకోవడ తప్పు కాదు కానీ. తీసుకోకుండా ఉండటం అనేది ఆయనపై అపార గౌరవం పెరిగింది. నా జీవితాంతం పసుపులేటి రామారావును గుర్తుంచుకొంటాను అని చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
నా సినిమా కెరీర్‌లో నాకు ఎంతో మంది జర్నలిస్టులతో మంచి రిలేషన్ ఉండేది. నన్ను, నా కెరీర్‌ను ఎన్నో టిప్స్‌తో సరిదిద్దిన వారిలో సీనియర్ జర్నలిస్టు గుడిపూడి శ్రీహరి, నందగోపాల్, పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. సెట్స్‌లో వారితో కలిసి ముచ్చటించేవాడిని. చక్కటి ఆరోగ్యకరమైన జర్నలిజం ఉండేది. ఆ సమయంలో గుడిపూడి శ్రీహరి గారు సితారలో రివ్యూలు రాస్తుండే వారు. ఆయన వాడే పదజాలం కఠినంగా ఉన్నప్పటికీ.. ఒక స్టూడెంట్‌కు టీచర్ చెప్పినట్టు ఉండేది. నా విషయంలో ఆయన రాసిందేమిటంటే.. బాగా చేస్తాడు. డ్యాన్సుల, యాక్టింగ్‌తో స్పీడ్ పెంచాడు. కానీ డైలాగ్ విషయంలో కూడా స్పీడ్‌గా మాట్లాడుతాడు.

Recommended Video

ఒక మాట వినేలోపే మరో డైలాగ్ వచ్చేది. నటనలో స్పీడ్ ఉండాలి కానీ.. డైలాగ్స్‌లో స్పీడ్ ఉండకూడదని అని రాశారు. అయితే అప్పటివరకు నేను స్పీడ్‌గా మాట్లాడుతారనే విషయం తెలియదు. దాంతో ఆయనను పిలిచి స్పీడ్ గురించి అడిగితే.. మీరు కాస్త స్పీడ్‌గా మాట్లాడుతారు. మీ చెవులకు ముందు వినిపించిందా లేదా అనేది గుర్తుంచుకోవాలని సలహా ఇచ్చారు. దాంతో నేను నా డైలాగ్ డెలివరీని మార్చుకొన్నాను. అలాగే నందకిశోర్ గారు.. జర్నలిజం గురించి చాలా విషయాలు చెప్పేవారు. వారిపై ఉన్న గౌరవంతోనే ఇక్కడికి వచ్చాను. నాపై ప్రేమతో ఇంటికి వచ్చి ఫిలిం జర్నలిస్టులు వచ్చి ఆహ్వానించినప్పుడు వెంటనే ఒప్పుకొన్నాను అని చిరంజీవి తెలిపారు.


Click it and Unblock the Notifications











