twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉప్పెన మరో రంగస్థలం కాబోతున్నది.. లీక్ భయం వెంటాడింది.. చిరంజీవి దిమ్మతిరిగే స్పీచ్

    |

    కరోనా భయాందోళనలతో సంవత్సర కాలంపాటు భవిష్యత్ ఏమిటో తెలియక అగమ్యగోచర పరిస్థితుల్లొ ఇంటికి పరిమితమయ్యాం. చుట్టు చీకట్ల మధ్య ఎప్పుడు సినీ పరిశ్రమ పనితో కళకళలాడుతాయి. ఈ రోజు పరిస్థితులను చూస్తుంటే మబ్బులు తొలిగి కాంతిని వెదజల్లుతూ తేజోవంతమైనట్టు ఉప్పెన ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తే అనిపిస్తున్నది అని చిరంజీవి ఎమోషనల్‌గా మాట్లాడారు. ఉప్పెన ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ..

    Recommended Video

    Megastar Chiranjeevi Praises Vijay Sethupathi In Uppena Pre release Event | Filmibeat Telugu
    ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు

    ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు

    సినీ పరిశ్రమ మళ్లీ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి కారణమైన ప్రేక్షకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సినిమా థియేటర్లు ఓపెన్ అయితే ప్రేక్షకులు వస్తారా లేదా అనే మీమాంసలో ఉన్న సమయంలో ధైర్యం చేసి థియేటర్‌కు వచ్చి సినిమాయే మాకు ఏకైక ఎంటర్‌టైన్‌మెంట్ చాటిచెప్పి, ప్రేమను కురిపిస్తున్న ప్రేక్షకులకు తలవంచి నమస్కరిస్తున్నాం అని చిరంజీవి అన్నారు.

     మీరు చూపించిన ప్రేమ, భరోసా వల్లే

    మీరు చూపించిన ప్రేమ, భరోసా వల్లే

    సినిమా థియేటర్‌కు ప్రేక్షకుల వస్తారా అనే భయభ్రంతులకు గురైన సమయంలో ప్రేక్షకులు చూపించే ప్రేమ, చూపించిన భరోసా, అభిమానాల వల్లే మేము ఇక్కడ బతుకుతున్నాం. మేమంత మీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం. అందుచేత మీకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం అని చిరంజీవి అన్నారు.

    ట్విస్టులు లీక్ చేస్తాననే భయంతో

    ట్విస్టులు లీక్ చేస్తాననే భయంతో

    ఉప్పెన సినిమా విషయానికి వస్తే.. నాకు ఉన్న బలహీనతతో ఈ సినిమా కథను, ట్విస్టులను లీక్ చేస్తాననే భయం వెంటాడుతున్నది. కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని బయటపెట్టను. ఈ సినిమా చూసిన నా మనసు ఆగలేదు. ఈ సినిమా గురించి ప్రజలకు చెప్పాలనే ప్రెస్ మీట్ పెట్టి మూవీ గురించి గొప్పగా చెప్పాలనే కోరిక కలిగింది. కానీ దానిని అణిచిపెట్టి ఉంచాను అని చిరంజీవి చెప్పారు.

    బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు షాక్ తిన్నా

    బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు షాక్ తిన్నా

    ఉప్పెన సినిమా కథ దృశ్యకావ్యం అని అనడం అతిశయోక్తి కాదు. దర్శకుడు సుకుమార్‌తో కలిసి బుచ్చిబాబు కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. నోటి నుంచి ఒక్క మాట కూడా పెగలలేదు. ఈ కథ ఎంత బాగుంది. లవ్ స్టోరిలు ఎన్నో చూశాం. ధనికుల అమ్మాయి పేదింటి అబ్బాయి కథలను ఎన్నో విన్నాం. ఇందులో ఉండే ఎమోషన్స్ పరకాష్ట అని చిరంజీవి పేర్కొన్నారు.

    మైత్రీ మూవీస్‌కు మరో రంగస్థలం

    మైత్రీ మూవీస్‌కు మరో రంగస్థలం

    ఉప్పెన సినిమా కథ పరంగానే కాకుండా.. గొప్ప స్క్రిన్ ప్లే బుచ్చిబాబు అందించబోతున్నాడు. ప్రేక్షకులు గొప్ప అనుభూతికి లోనవుతారు. ఈ సినిమా చూసిన తర్వాత మైత్రీ మూవీస్‌కు మరో రంగస్థలం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అని చిరంజీవి పేర్కొన్నారు.

    English summary
    Uppena Pre Release Event: Chiranjeevi attends as chief guest. In this occassion, Mega star gets grand welcome. Chiranjeevi wishes audience, Actrors and Vijay Sethupati. This event organises grandly. Vaishnav Tej emotional speach about Chiranjeevi, Pawan Kalyan in this event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X