ఫ్యాన్స్ ని ఉద్దేశించి చిరు ఇచ్చిన స్పీచ్

వచ్చిన మీ అందరికి హృదయపూర్వక స్వాగతం,అభినందనలు..మేము ఏ పని చేపట్టినా, ఏ శుభ కార్యం తలపెట్టినా, ఏ సినిమా కథ గురించి,ఏ సినిమా చేసినా,ఆలోచించినా,మా వ్యక్తిగత జీవితంలో మాకంటూ మా కార్యక్రమాలు.. ఏమున్నా ప్రతీది కూడాను అభిమానులు ఏమిటి..అబిమానులను ఏ విధంగా సంతోషపెట్టాలి..వాళ్ళ ఆశీస్సులు ..వారి అభినందనలు..ఎలా పొందాలి..తద్వారా ఎలా ఆనందింప చేయాలి అనేదే మా యొక్క బాడీలో అది ఇమిడిపోయింది. అభిమానలు వేరు,మేము వేరు అని ఎప్పుడూ చూసుకోవటం లేదు..వాళ్ళు లేనిదే మేము లేము..మేము,మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం హీరోలుగా మీ ఆశీస్సులు పొందన మేము మీ హృదయంలో స్దానం అలాంటి గొప్ప భావాన్ని మాకు ఇస్తూంటుంది.
అందుకునే ఈ రోజు ఈ శుభకార్యం జరుగుతుంది అని తెలిసిన మొదటి రోజునే అభిమానులును ఏ విధంగా ఆనందింప చేయాలి..ఎలా గౌరవింప చేయాలి..ఏ రకంగా వారిని కలుసుకోవాలని,మీ ప్రాముఖ్యత,ఇంపార్టెన్స్ మీకు తెలిసే ఉంటుంది. ఉపాసన, చరణ్ బాబుల పెళ్లి నిశ్చయం అయిన తర్వాత అభిమానలకు ప్రత్యేకించి విందు భోజనం ఇచ్చి వారి యొక్క ఆశీస్సలు,అభినందనలు పొందటానికి ఒక వేదిక ఏర్పాటు చేయాలని ఆ రోజే నిర్ణయించుకున్నామంటే మీకిచ్చే ప్రాముఖ్యత మీకందరికి అర్దమయ్యే ఉంటుంది. ఈవ్యక్తిగత జీవితంలో మీరు,మీ ప్రాముఖ్యత మీ స్దానం, అంతగా ఉన్నదని చెప్పటానికి ఈ యొక్క వేదిక,ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.
మీ ఆశిస్సులు లేకుండా ,మీ అభినందనలు లేకుండా మీ అభిమానం లేకుండా మేమి ఈ స్దాయికి వచ్చేవారం కాదు..అందుకే మీ పట్ల మేము కృతజ్ఠతగా ఉంటాం. ఒక్కోసారి మిమ్మల్ని రంజింప చేయటమే...ప్రాదాన్యత, అదే మా పరమావిధి..మీకు ఎలాగ వినోదం ఇవ్వాలి అన్న దృష్టి నుంచి మేము కథ ఎలా ఎంచుకోవాలనేది ఉంటుంది. అలాగే ఆ కథలో ఎలాంటి అంసాలు పెడితే..మీరు ఉత్సాహంగా ఉంటారు...మీరు ఆనందంగా ఉంటారు..మరికొంత కాలం మామీద అభిమానం చూపించి ఎలాగ మమ్మల్ని ప్రేమిస్తారు అనేదే మా ఆలోచన. కొన్ని సినిమాలు కొంత కాలం చేసిన తర్వాత మేము మా గురించి కాదు మా ఆలోచనలు మీ చుట్టూనే తిరుగుతూంటాయి. అలాగే ఈ పంక్షన్ ఇంత బాగా జరగటానికి ఎంతోమంది కృషి ఉంది..వారికి సభాముఖంగా కృతజ్ఠతలు తెలియచేస్తున్నాను.
ఉపాసన వండ్రఫుల్ గర్ల్...ఉపాసన మహాలక్ష్మిలాగ మా ఇంట్లోకి వచ్చింది. కోడలిగా మావాడి అర్దాంగిగా వచ్చింది. నాకు నా భార్య సురేఖ ఎలా సపోర్టు నిలిచిందో కొడుకుగా తన తల్లి గురించి రామ్ చరణ్ కి తెలుసు. అలాంటి భావాలు,అలాంటి నడవిడిక,అలాంటి ప్రవర్తన కోపరేటివ్ ఉండే తత్వం ఉపాసనలో ఉన్నాయి. మీ అందరి సమక్షంలో మహాలక్ష్మిలాంటి ఉపాసనను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నా కొడుకు ప్రొఫెషినల్ గానే కాదు పర్శనల్ గానూ సక్సెస్ అయ్యాడని పించింది. ఇంత లక్షణమైన అమ్మాయి ఉపాసనను తన జీవితంలోకి తెచ్చుకున్నాడు. నాకు చాలా చాలా తృప్తిగా ఉంది.


Click it and Unblock the Notifications











