వెంటాడింది..: ఆ సంఘర్షణలో కొట్టుమిట్టాడిన చిరు!, చివరికిలా బయటపడ్డారట..

ఇంత గ్యాప్ వచ్చింది?.. జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో!.., ఆన్ స్క్రీన్ మునుపటి రిథమ్ కనిపిస్తుందా?.. రీఎంట్రీ సమయంలో చిరంజీవి చుట్టూ ముసురుకున్న ప్రశ్నలివి.

కానీ ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. వెండితెరతో ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత కూడా తన బాడీలో ఏమాత్రం రిథమ్ తగ్గలేదని నిరూపించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నం.150 సమయంలో తన మనసులో ఎటువంటి సంఘర్షణ జరిగిందో తాజాగా చెప్పుకొచ్చారు..

ఇప్పుడున్న జనరేషన్ 'చిరంజీవిని' చూస్తారా?:

ఇప్పుడున్న జనరేషన్ 'చిరంజీవిని' చూస్తారా?:

తాజాగా 'జీ' టీవి చానెల్ నిర్వహించిన గోల్డెన్ అవార్డ్స్ వేడుకలో మెగాస్టార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాలా రోజులుగా తన మనసులోనే ఉంచుకున్న కొన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తమిళ సినిమా కత్తి రీమేక్ తో రీఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన వచ్చినప్పుడు.. ఇప్పుడున్న జనరేషన్ తనను చూస్తారా? అన్న అనుమానం కలిగిందన్నారు.

అదలా వెంటాడింది..:

అదలా వెంటాడింది..:

ఇప్పటి జనరేషన్ తనను చూస్తారా? అన్న అనుమానం చాలా కాలం తన మనసులోనే ఉండిపోయిందని, ఖైదీ నం.150షూటింగ్ తర్వాత కూడా కొంత కాలం వెంటాడిందని చిరు చెప్పుకొచ్చారు. కానీ సినిమా విడుదలయ్యాక తన అనుమానాలన్ని పటాపంచలయ్యాయని, అందుకు గల కారణాన్ని వివరించారు.

ఆ సంఘర్షణ నుంచి ఇలా బయటపడి..:

ఆ సంఘర్షణ నుంచి ఇలా బయటపడి..:

గుంటూరులో 'ఖైదీ నం.150' ప్రీ-రిలీజ్ వేడుకలకు వెళ్లినప్పుడు.. తనను చూడటానికి ఎక్కువమంది 15-25ఏళ్ల లోపే వచ్చారని.. అది చూశాక తన భయాలన్ని ఎగిరిపోయాయని అన్నారు. ఇప్పటి జనరేషన్ తనను ఎలా రిసీవ్ చేసుకుంటుందోనన్న అనుమానం ఆ దెబ్బతో తొలగిపోయిందన్నారు.

చిరు ఛమత్కారం..:

చిరు ఛమత్కారం..:

ఖైదీ నం.150 విడుదలయ్యాక.. వంద కోట్లకు పైగా వసూళ్లు చేయడం చూసి.. ఈ జీవిని ఇంకా చిరంజీవిగానే గుర్తుంచుకున్నారని మెగాస్టార్ పేర్కొన్నారు. అంతేకాదు, తనకు ఇవ్వాల్సింది కమ్ బ్యాక్ అవార్డు కాదని, వెల్ కమ్ బ్యాక్ అవార్డు అని ఛమత్కరించారు. ఈ సందర్భంగా చిరు కమ్ బ్యాక్ అవార్డును కృష్ణంరాజు - టి.సుబ్బరామిరెడ్డి సంయుక్తంగా అందజేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X