twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇప్పుడు నా పరిస్థితి ఇదీ, నా వద్దకు ఎవరూ తీసుకురాలేదు: చిరంజీవి

    |

    తన మొట్టమొదటి సినిమా విడుదలైన సమయంలో తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహా రెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చాలా కాలం తర్వాత తాను కోరుకున్న సినిమాను తీశానని అభిప్రాయపడ్డారు.

    అప్పటి పరిస్థితే ఇప్పుడూ

    అప్పటి పరిస్థితే ఇప్పుడూ

    తన మొట్టమొదటి సినిమా ప్రాణం ఖరీదు విడుదలైనప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది, ప్రజలు ఏమనుకుంటారు, తన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే మీమాంసలో ఉండిపోయానని చిరంజీవి చెప్పారు. ఓ పక్క టెన్షన్, మరో పక్క ఎగ్జయిట్మెంట్, ఇంకోపక్క ఏదో తెలియని ఉద్విగ్న.. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో ఉండిపోయానని, అప్పుడు తాను ఈ నేల మీదలేనని, అలాంటి ఫీలింగ్ తనలో 41 ఏళ్ల తర్వాత 2019 సెప్టెంబర్ 22న ఉందన్నారు. దీనికి కారణం ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అన్నారు. ఏ కథ ఐనా అల్లుకుంటాం, సెట్స్ పైకి తీసుకు వెళ్తామని, కానీ ఈ సినిమా అలా కాదన్నారు.

    ఆ కథ నా వద్దకు ఎవరూ తీసుకు రాలేదు

    ఆ కథ నా వద్దకు ఎవరూ తీసుకు రాలేదు

    ఈ సినిమా దాదాపు పుష్కర కాలానికి మించి నా మదిలో మెదులుతోందని చిరంజీవి చెప్పారు. దాని కంటే 20 ఏళ్ల ముందు నేను చేయాలనుకున్న పాత్ర భగత్ సింగ్ అన్నారు. స్వాతంత్ర సమరయోధుడి పాత్ర చేసి, ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనేది తన కోరిక అన్నారు. కానీ ఎందుకో భగత్ సింగ్ కథను తన ముందుకు ఏ నిర్మాత, కథకులు, దర్శకులు తీసుకు రాలేదని, దీంతో తన కోరిక, కల అలాగే ఉండిపోయిందన్నారు. కానీ ఆ తర్వాత పుష్కర కాలం ముందు పరుచూరి బ్రదర్స్ ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథను తీసుకు వచ్చారన్నారు.

    రామ్ చరణ్ ముందుకు వచ్చాడు

    రామ్ చరణ్ ముందుకు వచ్చాడు

    యోగిలాంటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అన్నారు. తనను చాలాకాలంగా ఈ సినిమా చేయాలని అడుగుతున్నారని చెప్పారు. ఉయ్యాలవాడ గురించి పెద్దగా ఎవరికీ తెలియదని, ఆ సమయంలో తనకు కూడా తెలియదని, ఆయన పైన స్థానికంగా చిన్న పుస్తకాలు, లోకల్‌గా బుర్రకథలు, కొన్ని ఒగ్గు కథలు ఉన్నాయే కానీ, అంతకుమించి ఆయన గురించి ఏ ప్రాంతానికి పాకలేదన్నారు. గొప్ప యోధుడు అని, తెరమరుగైన నాయకుడు అన్నారు. ఈ మహా యోధుడు గురించి అందరికీ తెలియజేయాలని ఈ సినిమా తీస్తున్నామన్నారు. ఇతను తెలుగువారు అని, ఇలాంటి వారి గురించి దేశానికి తెలియజేసేందుకు ఈ సినిమాను తీశానన్నారు. ఇలాంటి సినిమా కోసమే ఇన్నాళ్లు వేచి చూశానని చెప్పారు. తొలుత ఈ సినిమాకు భారీ బడ్జెట్ కారణంగా నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో అప్పుడు ఆగిపోయిందన్నారు. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమా తీసేందుకు ముందుకు వచ్చాడన్నారు.

    యూత్ కనెక్ట్ అవుతారు

    యూత్ కనెక్ట్ అవుతారు

    ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అవుతారని చిరంజీవి చెప్పారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వంటి వారు దేశం కోసం ఎంతో త్యాగం చేశారన్నారు. మహానుభావులను గుర్తుకు చేసుకోవడమే జాతీయ గీతం అన్నారు. దానిని అందరూ గౌరవించాలన్నారు. ఈ సినిమాకు భారీగా ఖర్చు చేసినట్లు చెప్పారు. ఈ సినిమాలో కావాల్సింది తనకు లాభాపేక్ష, లాభాలు కాదన్నారు. చాలా గొప్ప సినిమా తీశారని అందరూ అనుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో నటించేందుకు అమితాబ్ బచ్చన్ అంగీకరించారని, ఆయనకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని చెప్పారు. కన్నడ టాప్ నటుడు కిచ్చ సుదీప్, డే అండ్ నైట్ పని చేస్తూ చాలా బిజీగా ఉండే విజయ సేతుపతి కూడా ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారని అందుకు థ్యాంక్స్ అన్నారు.

    English summary
    Megastar Chiranjeevi's spech in Syeraa prerelease event. Sye Raa pre release event: Megastar Chiranjeevi's Sye Raa Narasimha Reddy pre release event is orgnaised at LB Stadium of Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X